మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకొని, రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే జరిగే న్యాయసదస్సు కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్టానికి స్పందించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు, ఎఐసిసి ముఖ్య నేతలతో పాటూ, కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు..
జడ్జి ఎదుట కంటతడి పెట్టిన రాజ్ కేసిరెడ్డి.. రూ.11 కోట్లపై కోర్టు కీలక ఆదేశాలు..!
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు సిట్ పోలీసులు.. అయితే, న్యాయమూర్తి ఎదుట కంట తడి పెట్టారు రాజ్ కేసిరెడ్డి.. తనకు సంబంధం లేకపోయినా 11 కోట్ల రూపాయలు తనవే అని సిట్ లింకులు పెడుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.. ఆ 11 కోట్ల నగదుపై ఉన్న నంబర్స్ రికార్డ్ చేయాలని న్యాయమూర్తిని కోరాడు కేసిరెడ్డి.. తాను 2024 జూన్ లో ఆ డబ్బు వరుణ్ కి ఇచ్చినట్టు చెబుతున్నారని.. ఆ నోట్లు RBI ఎప్పుడు ముద్రించింది అనేది చూడటానికి నంబర్స్ రికార్డ్ చేయాలని విజ్ఞప్తి చేశాడు..
రష్యా చమురు కొనుగోళ్లకు భారత్ బ్రేక్..?
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై పశ్చిమదేశాలు అనేక ఆంక్షలు విధించాయి. అయినప్పటికీ మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయా అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీనిపై భారత్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చినప్పటికీ.. దీన్ని ఓ సాకుగా చూపిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇండియాపై 25 శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారతీయ సంస్థ నిలిపివేశాయంటూ వార్త కథనాలు వస్తున్నాయి.
సాగునీటి ప్రాజెక్టుల పై లోకేష్ కు అవగాహన లేదు..
మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హరీష్ రావు మాట్లాడుతూ.. “బనకచర్ల కట్టి తీరుతాం అని లోకేష్ మాట్లాడుతున్నారు.. కేంద్రం బలం, రేవంత్ రెడ్డి బలం చూసుకొని లోకేష్ మాట్లాడుతున్నారు.. లోకేష్ అలా మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించ లేదు.. సీఎం, మంత్రులు ఎవరూ కూడా ఖండించలేదు..ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకొని ఉంది.. మేము కడితే ఎవరు ఆపుతారో చూస్తాం అని లోకేష్ అంటుంటే ..బనకచర్ల కట్టట్లేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. బనకచర్ల పై లోకేష్ బరి తెగింపు మాటలు మాట్లాడుతున్నారు.. సాగునీటి ప్రాజెక్టుల పై లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడు తున్నారు.
నితీష్‌కుమార్‌కు షాక్!.. బీజేపీ సీఎం అభ్యర్థిని ఫోకస్ చేసే యోచనలో అధిష్టానం!
బీహార్‌లో ఏడాది చివరి కల్లా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అన్ని పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే తాజాగా వెలువడిన సర్వేలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రజాదారణ తగ్గినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికల స్టేట్ వైబ్ సర్వే ఆఫ్ బీహార్ ఎలక్షన్స్ 2025 (కుల-సమాజ వారీ ఓటింగ్) ప్రకారం 25 శాతం మందే నితీష్ కుమార్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌నే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని 32.1 శాతం ప్రజలు కోరుకుంటున్నారు. ఇక నితీష్ వైపున 38 శాతం ఎస్టీలు, 27 శాతం ఎస్సీ, ముస్లింలు, 24 శాతం ఉన్నత తరగతి హిందువులు, 21 శాతం ఓబీసీలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 శాతం మంది ముస్లింలు తేజస్వి యాదవ్ వైపే ఉన్నారు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారు.
లైంగిక దాడి కేసులో కీలక తీర్పు.. ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చిన కోర్టు
లైంగిక దాడి కేసులో జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రుజువు కావడంతో 14 నెలల తర్వాత దోషిగా తేలుస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఇక శనివారం బెంగళూరులోని ఎంపీలు/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణకు శిక్ష ఖరారు చేయనుంది.
రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మహిళ గత ఏడాది ఏప్రిల్‌లో మాజీ ఎంపీపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి రేవణ్ణ తనపై పదే పదే అత్యాచారం చేశాడని.. ఎవరికైనా చెబితే వీడియోలను విడుదల చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు గత ఏడాది మే 31న అరెస్టు చేశారు. ఇక 2 వేలకు పైగా అశ్లీల వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
వైఎస్ హయాంలోనే మేం ఐటీని ప్రోత్సహించాం..
వైఎస్ హయాంలోనే మేం ఐటీని ప్రోత్సహించామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది.. సామాన్యుడి మనుగడ కష్టమైపోయింది.. మేము ఒత్తిడి చేస్తేనే హామీలు అమలు చేస్తున్నారు.. మా ఒత్తిడి వలనే రేపు అన్నదాత సుఖీభవ ఇస్తున్నారు.. పథకాలు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు.. మా నాలుక మందం కాదు.. ప్రభుత్వ మెడలు వంచి పథకాలు ఇచ్చేలా చేస్తామని చెప్పాం అన్నారు.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీనించాయి.. పోలీసులు అంటే ఎవరికీ భయం లేదు.. మాజీ మంత్రి పరామర్శకు జగన్ వెళ్తే జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.. జగన్ పర్యటనకు జనం వస్తే టీడీపీ నేతలు ఎందుకు రగిలిపోతున్నారు..? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి రోజా కోసం ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు టీడీపీ నేతలు ఎందుకు ఖండించలేదు.. గతంలో ఎప్పుడూ విశాఖలో డ్రగ్స్ కల్చర్ లేదు.. ఈ ప్రభుత్వం వచ్చాకే డ్రగ్స్ కేసులు పెరగవు.. డ్రగ్స్ కేసు దర్యాప్తులో కమిషనర్ ముందు ఒకలా తరువాత మరోలా మాట్లాడారు.. విశాఖలో క్రైమ్ రేట్ లెక్కలు చూస్తే వాస్తవాలు బయటకు వస్తాయి.. పోలీసు వ్యవస్థను పని చెయ్యనివ్వడం లేదు అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
తోక తిప్పితే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..
జమ్మలమడుగు అభివృద్ధిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు. పేదల సేవలో తాను ఉండాలని సింగపూర్ కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చినట్టు తెలిపారు. తాజాగా కడపలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 64 లక్షల మందికి 33 వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ గా పేదలకు ఇస్తున్నామని చెప్పారు. ఒక నెలలో పెన్షన్ తీసుకోకపోతే రెండో నెలలో పెన్షన్ ఎగ్గొట్టేవారు.. ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తాం. రెండు నెలలు లేకపోయినా మూడవ నెలలో ఇస్తామని వెల్లడించారు. పెన్షన్ల పంపిణీలో టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం.. పెన్షన్ల పంపిణీ ఇష్టానుసారంగా జరుగుతూ ఉంటాయని తెలిపారు. ఎక్కడ పెన్షన్ పంపిణీ చేశారో తెలుసుకునే యంత్రాంగాన్ని పెట్టామన్నారు.. పెన్షన్ల పంపిణీలో లంచాలు అడిగారా అని ఆరా తీస్తున్నామన్నారు.. పెన్షన్లు ఉద్యోగులు పేదలకు గౌరవప్రదంగా ఇవ్వాలి… 89 శాతం పెన్షన్లు బాధితుల ఇళ్ల వద్ద ఇచ్చామని వెల్లడించారు…
పనులు ఆలస్యం కావడం వల్ల ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెరిగిపోతుంది
దక్షిణ భారతదేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రంగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో రెండు యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. మిగిలిన మూడు యూనిట్ల పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయని, రిపబ్లిక్ డే నాటికి అవి పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ, రెండు సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్టును గాలికి వదిలేశారని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు, సమస్యల పరిష్కారంలో కూడా అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పారు. పనులు ఆలస్యం కావడంతో ప్రభుత్వం ఆర్ధికంగా భారితనాన్ని మోస్తుందని ఆయన పేర్కొన్నారు.
మీ కుటుంబం చరిత్ర మాకు తెలియదా?.. హోం మంత్రిపై అంబటి రాంబాబు ఫైర్
164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు జగన్ నామ జపం చేస్తున్నారని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.. తాజాగా అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీల ప్రక్రియ సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పనిచేస్తున్నారని.. చిట్టి నాయుడు దెబ్బకు చంద్రబాబు బుర్ర కూడా పోయిందన్నారు.. జగన్ ను ఆపటం మీ తరం కాదు.. జగన్ వస్తే విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు.. లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన హోం మంత్రి ఆ పని చేయటం లేదు.. హోం మంత్రి జగన్ విషయాలు మాట్లాడటం, తిట్టే కార్యక్రమాలు మాత్రమే చేస్తుందని రాంబాబు ఫైర్ అయ్యారు..