ట్రంప్ వ్యాఖ్యలను తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తోసిపుచ్చారు. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశం అయ్యే ఆలోచన మాకు లేదని వెల్లడించారు.
US Strike: అమెరికా ఇరాన్‌పై దాడులు నిర్వహించిన కొన్ని రోజులు తర్వాత, తమ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్‌లోని అత్యంత కీలకమైన, అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీ దెబ్బతిన్నట్లు శాటిలైట్ ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. ఈ వారాంతంలో అమెరికా దాడుల్లో తమ దేశ అణు సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై బుధవారం అన్నారు.
ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.. జేడీ వాన్స్ కీలక ప్రకటన ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల తర్వాత.. ఇరాన్‌కు అణు సామర్థ్యం లేదని ప్రకటించారు. ఇకపై ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించలేదని పేర్కొన్నారు. అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలు…
నేడే ఏపి క్యాబినెట్ భేటీ.. పలు ప్రాజెక్టులకు ఆమోదం..! నేడు (జూన్ 24) ఉదయం 11 గంటలకు ఏపి క్యాబినెట్ భేటీ అమరావతి వేదికగా జరగనుంది. ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. ఇందులో భాగంగా.. 7వ ఎస్ఐపీబీ సమావేశంలో అమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ సమావేశంలో వైజాగ్ లో కాగ్నిజెంట్ ఏర్పాటు కు సంబంధించి చర్చ జరగనుంది. అమరావతి…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధంలోకి అమెరికా కూడా ప్రవేశించింది. దీంతో ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి.
ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం.. భారీగా పెరిగిన ఆయిల్ ధరలు.. భారత్‌పై ఎఫెక్ట్! ఇరాన్- ఇజ్రాయెల్ దేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. నిన్న ( జూన్ 22న) హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర…
Hands off Iran: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ వార్ లోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతలతో యూఎస్ ప్రధాన నగరాల్లో ఇరాన్‌కి మద్దతుగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండడం ఇప్పుడు తీవ చర్చనీయాంశంగా మారింది.
Iran-Israel War: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెల్ అవీవ్ తాజాగా భారీ స్థాయిలో దాడులకు దిగింది. టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది.
హౌతీ రెబల్స్ అగ్ర రాజ్యం అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తే.. భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పింది. అలాగే, ఎర్ర సముద్రంలో యూఎస్ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది.
Earthquake: ఇజ్రాయెల్ దాడులతో సతమతమవుతున్న ఇరాన్లో మరోసారి భూకంపం సంభవించింది. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.