తెలంగాణలో రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలు దాటింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఈ ఏడు జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది..
కొమురం భీమ్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో అరుదైన సంఘటన జరిగింది. ఒకే మండపంలో ఇద్దరు యువతులను ప్రేమించి, వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు యువకుడు. అటు గ్రామస్థులనే కాదు, ప్రజలనూ ఆశ్చర్యపరిచాడు. ఈ వినూత్న వివాహానికి మూడు గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలకు ఆశీస్సులు అందజేశారు.
Asifabad: ఇటీవల తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. స్థానికత ఆధారంగా సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, అగ్నిమాపక విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి తాజాగా బెజ్జూరు మండలం కుకుడ గ్రామంలో ఎద్దుపై దాడి చేసింది. దీంతో ఎద్దు తీవ్రంగా గాయపడింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం సృష్టించింది. ఆపట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూసి భయాందోళనలకు గురయ్యారు.
Tiger attack in Maharashtra.. Two killed: మహారాష్ట్రలో పులులు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంద్రపూర్ జిల్లాలో ఇద్దరు పశువుల కాపర్లపై దాడి చేసి హతమార్చింది ఓ పెద్దపులి. జల్లాలోని మూతాలాకా చించాడా గ్రామానికి చెందిన నానాజీ నీకేసర్(53), దివరూ వసలేకర్(55) ఇద్దరు పశువులను మేపేందుకు సమీపంలో అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ సమయంలో వీరిద్దరిపై పులి పంజా విసిరింది. దీంతో వారిద్దరు మరణించారు. దీంతో స్థానికంగా ఉన్న గ్రామస్థులు భయాందోళనకు గురువుతున్నారు. ఇటీవల కాలంలో చంద్రపూర్, గడ్చిరోలి…