గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా జంట జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో రాగల రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే.. జనగామ జిల్లా కొలనపాక-బచ్చన్నపేట మధ్యలో వాగు ఉధృతి కొనసాగుతుంది. ఓ స్కూల్ టీచర్ వాగు దాటేందుకు స్కూటీతో వెలుతుండగా వాగు మధ్యలోనే కొట్టుపోయింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను కాపాడారు. టీచర్ బచ్చన్నపేటకు స్కూటీపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
read also: Commonwealth Games: గతేడాదిలో చెప్పింది.. ఇప్పుడు పతకం సాధించింది
జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల చెరువులు మత్తడి పోస్తున్నాయి. జనగామ-హుస్నాబాద్ ప్రధాన రహదారి జనగామ మండలం వడ్లకొండ వద్ద ఉన్న కాజు వే పై వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాగుపై వాహనాల రాకపోకలు బంద్ చేసారు. సర్పంచ్ ఆధ్వర్యంలో ముందస్తుగా రోప్ సహాయక చర్యలు ఏర్పాటు చేసారు. పొంగిపొర్లుతున్న వాగుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసారు. పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు పూర్తిగా జలమయం మైంది. పట్టణంలోని కుర్మవాడ, బాలాజీ నగర్,జ్యోతి నగర్, శ్రీనగర్ కాలనీల్లో వరద నీరు చేరి వాగులను తలపిస్తున్నాయి.
Nellore Bus Incident: డ్రైవర్ లేకుండానే బస్సు పరుగులు.. అసలేం జరిగిందంటే?