Liquor Shops: మద్యం దుకాణాల లైసెన్స్‌కు నోటిఫికేషన్.. ఈనెల 21న ఓపెన్ లాటరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Shops: రాష్ట్రంలో వచ్చే రెండేళ్లకుగానూ రిజర్వ్‌వుడ్ వైన్‌ల కేటాయింపు ప్రక్రియ గురువారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపుల్లో 1,834 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. గౌడ్‌లు, ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో గౌడ్‌లకు 393 (15 శాతం), ఎస్సీలకు 262 (10 శాతం), షెడ్యూల్డ్ ఏరియా ఎస్టీలకు 95, నాన్ షెడ్యూల్డ్ ఎస్టీలకు 36, మొత్తం 131 (5 శాతం) షాపులను కలెక్టర్లు రిజర్వ్ చేశారు. 2023-25 కాలానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్స్‌కు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఈ నెల 21న ఓపెన్ లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకే వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే రిజర్వ్‌డ్ షాపులకు ఆయా వర్గాలకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్ రూపంలో కానీ చెల్లించవచ్చు. జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read also: Techie Death: కర్ణాటకలో టెక్కీ మృతి.. ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో వెలుగులోకి..
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
ఎక్సైజ్ శాఖ వచ్చే రెండేళ్ల (2023-25) మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు ప్రక్రియను నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రూ.రెండు లక్షలుగా (నాన్ రిఫండబుల్), స్పెషల్ రీటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ధారించారు.
Liquor Shops: మద్యం దుకాణాల లైసెన్స్‌కు నోటిఫికేషన్.. ఈనెల 21న ఓపెన్ లాటరీ..
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!