Techie Death: బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. కడుగోడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన వీరాంజనేయ విజయ్, ఆయన భార్య హేమావతి, ఇద్దరు పిల్లలు సీగేనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. పిల్లల్లో ఒకరికి ఏడాదిన్నర కాగా మరొకరికి ఎనిమిది నెలల వయస్సు. భార్యాపిల్లలను చంపిన వీరాంజనేయులు కూడా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్ని రోజులుగా హేమవతి ఫోన్ ఎత్తకపోవడం, మెసేజ్‌లు పంపినా రిప్లై ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆమె సోదరుడు వెంటనే బయలుదేరి బెంగళూరు వచ్చాడు. స్థానికులతో కలిసి ఈ కుటుంబం ఉంటున్న ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Nabha Natesh: అబ్బా అనిపించేలా ఉన్నావ్ నభా…
పోలీసులు గురువారం తలుపులు తెరిచి చూడగా బెడ్‌పై ముగ్గురు, ఫ్యాన్‌కు వీరాంజనేయులు వేలాడుతూ కనిపించారు. పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కడుగోడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జూలై 31న జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. ఈ కుటుంబం మూడేళ్ల క్రితం బెంగళూరు వచ్చినట్లు తెలుస్తోంది.. వీరాంజనేయులు ఇంట్లో మొబైల్స్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటాను పరిశీలించే పనిలో ఉన్నారు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. హత్య, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన మిస్టరీగా మారగా వీరాంజనేయులు, హేమావతి కుటుంబ సభ్యులను అడిగి మరింత సమాచారం రాబట్టే పనిలో పడ్డారు.
AI Replacing Jobs: మహిళల పాలిట శాపంగా AI .. షాకింగ్ నిజాలు..