TGANB : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు…
తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సహకారంతో ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB), మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ , మరియు సివిల్ ఫోర్స్ ట్రస్ట్ భాగస్వామ్యంతో చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘ఆపరేషన్ సంకల్ప్’ అధికారికంగా ప్రారంభించబడింది. Also Read:Konda Vishweshwar Reddy: నేను బీఆర్ఎస్…
ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల 83 మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఆల్ఫాజోలం కలిపినా కల్లు తాగడం వల్ల అస్వస్థత లోనయ్యారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీజీఎన్‌ఏబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల కోసం 26 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.