నల్లకుంటలో దారుణం చోటుచేసుకుంది. అనుమానంతో భార్యని అతి దారుణంగా హత్య చేశాడు ఓ భర్త. ఇంట్లో పిల్లల ముందే భార్యపై దాడి చేసి.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకున్న కూతురిని సైతం మంటల్లో తోసేసి పరారయ్యాడు. తల్లీకూతుళ్ల అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే భార్య మృతి చెందగా.. స్వల్ప గాయలతో కూతురు బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Phone Tapping Case: సిట్…
Child Trafficking : సైబరాబాద్ చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు సాగుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాల నుంచి పసికందులను అక్రమంగా తరలిస్తూ హైదరాబాద్ వేదికగా సాగిస్తున్న ఈ దందాలో అంతర్రాష్ట్ర ముఠాల హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ముఖ్యంగా పుట్టిన రోజు కూడా నిండని పసికందులను తీసుకువచ్చి ఇక్కడ భారీ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కిడ్నాప్ చేస్తున్నారా లేదా పేద తల్లిదండ్రుల నుంచి…
Child Trafficking : హైదరాబాద్ నగరం నడిబొడ్డున పసికందులను విక్రయిస్తున్న ఒక భారీ మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (SOT) పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఈ ముఠా కార్యకలాపాలను గమనించిన పోలీసులు, మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 12 మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ ముఠా సభ్యులు కేవలం స్థానికంగానే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి, ప్రధానంగా అహ్మదాబాద్ వంటి నగరాల నుండి…
వివాహేతర సంబంధం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, కట్టుకున్న భర్త ప్రాణాలను బలిగొనేలా చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అశోక్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు బయటపడ్డాయి.
Physical Harrasment : ప్రముఖ విద్యాసంస్థ జేఎన్టీయూ (JNTU)లో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఒక మహిళపై అక్కడే పనిచేస్తున్న ప్రొఫెసర్ లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యాసంస్థలోనే ఉద్యోగ సంబంధాల పేరుతో ప్రారంభమైన వేధింపులు, తర్వాత మానసిక బెదిరింపులు, చివరికి అత్యాచారానికి దారి తీసిన విధానం ఇప్పుడు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఒకే సామాజిక వర్గానికి చెందినవారమని నమ్మకాన్ని పెంచుతూ,…
Shocking : హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన పరువు హత్య ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమే కారణంగా ఓ యువకుడిని ఇంటికి పిలిపించి బ్యాట్లతో కొట్టి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. బీరంగూడ ప్రాంతానికి చెందిన సాయి (20), అదే ప్రాంతానికి చెందిన యువతి (19) గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పెళ్లి విషయంపై మాట్లాడతామని సాయిని…
Anesthetic Injections : హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చోటుచేసుకున్న మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది. మత్తు కోసం అనస్తీషియా ఇంజెక్షన్లు తీసుకున్న ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి చెందిన ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కేసులో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేయగా, వైద్య వృత్తికే మచ్చ తెచ్చే విధంగా కీలక విషయాలు కలకలం రేపుతున్నాయి. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు కొంతకాలంగా మత్తు కోసం ఇంజెక్షన్లకు అలవాటు పడ్డారు. సాధారణ మత్తు…
Shocking : చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో, ఇది హత్య, ఆత్మహత్యనా లేక డ్రగ్స్ ఓవర్‌డోసా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన యువకులను పోలీసులు జహంగీర్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మరణాలు సహజంగా సంభవించి ఉండకపోవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో లోపల కీలక ఆధారాలు…
హైదరాబాద్‌లో నకిలీ ఖాకీ వ్యవహారం వెలుగుచూసింది. జీడిమెట్ల పోలీసు పరిధిలో నకిలీ లేడీ కానిస్టేబుల్‌గా వ్యవహరించిన ఉమాభారతి అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
Fake Notes : మెహదీపట్నం పోలీసులు, కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ వెస్ట్ జోన్ బృందం సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించి నకిలీ కరెన్సీ తయారీ గ్యాంగ్‌ను పట్టుకున్నారు. ఈద్గా గ్రౌండ్స్, ఫస్ట్ లాన్సర్ వద్ద దాడి చేసి మొత్తం 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹4.75 లక్షల నకిలీ ₹500 నోట్లను, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక కారు, తొమ్మిది మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు కస్తూరి…