Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- డిసెంబర్లో స్కూళ్లు సిద్ధం
- నిధుల సమస్యలకు చెక్
- ఫర్నిచర్ ఏర్పాట్లు షురూ
- పనుల నాణ్యతపై ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ పైలట్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు విద్యాకమీషన్ చర్యలు తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా మంచాల, వంగూరు, పోల్కంపల్లి పబ్లిక్ స్కూళ్ల నిర్మాణ పనులను ప్రతి బుధవారం సమీక్షిస్తూ, నిర్దేశిత డిసెంబర్ గడువు నాటికి పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ పాఠశాలల్లో కొనసాగుతున్న నిర్మాణాల పురోగతి, నిధుల విడుదల, మౌలిక వసతులు, ఫర్నిచర్ సమకూర్పుపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ గణపతి రెడ్డి, విద్యాకమీషన్ సభ్యులు, సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు (HMలు) , కాంట్రాక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
నిధుల ఆలస్యానికి స్వస్తి.. పనుల్లో నాణ్యతే ప్రామాణికం..
పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్న మూడు పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులను నవీన్ నికోలస్ ఆదేశించారు. కొన్ని పనులకు నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. నిధుల కొరత కారణంగా ఏ ఒక్క పని కూడా ఆగిపోకుండా సంబంధిత శాఖలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తిచేసి విద్యార్థులకు ఆధునిక, మెరుగైన విద్యా వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
Also Read
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
- Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
జైళ్ల శాఖ నుంచి ఫర్నిచర్.. హెచ్ఎంలకు నికోలస్ ఆదేశాలు
పాఠశాల భవనాల నిర్మాణాలు పూర్తయ్యే సమయానికి అవసరమైన ఫర్నిచర్‌ను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలోని ఖైదీలు తయారుచేసే నాణ్యమైన ఫర్నిచర్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించారు. విద్యార్థుల సంఖ్య , తరగతి గదుల అవసరాలకు తగ్గట్టు బెంచీలు, డెస్క్‌లు, టేబుళ్లు, కుర్చీల వివరాలతో కూడిన పూర్తి ఇండెంట్‌ను తక్షణమే సిద్ధం చేయాలని హెచ్ఎంలను నవీన్ నికోలస్ ఆదేశించారు.
బిల్లులు, మెజర్మెంట్ బుక్స్‌పై ఎండీ గణపతి రెడ్డి స్పష్టత
ఈ మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో పూర్తయిన పనులకు సంబంధించి మెజర్మెంట్ బుక్స్ (MB) నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ గణపతి రెడ్డి తెలిపారు. పనుల కొలతలు, బిల్లుల చెల్లింపులు సమన్వయంతో జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, అధికారులు, హెచ్ఎంలు, కాంట్రాక్టర్లు ఐక్యంగా పనిచేసి డిసెంబర్ నాటికి ఈ ప్రతిష్టాత్మక పాఠశాలలను అందుబాటులోకి తేవాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!