సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే ప్రారంభమైందన్నారు. అలాగే, యువతకు ఉద్యోగాలు రావాలని శ్రీకాంతా చారి బలిదానం చేశాడు అన్నారు.
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. తాజాగా బుధవారం తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. మా ప్రభుత్వం ఏర్పడగానే జీవికా సీఎం (కమ్యూనిటీ మొబిలైజర్స్) దీదీలను పర్మినెంట్ చేసి.. నెలకు రూ.30,000 జీతం ఇస్తామని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రైల్వే, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి వాటిల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాటిల్లో రైల్వే అప్రెంటిస్ రెక్రూట్‌మెంట్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్‌మెంట్, జాతీయ దర్యాప్తు సంస్థలో నియామకాలకు త్వరలోనే దరఖాస్తు గడువు ముగియనున్నది. మరికొన్ని రోజులే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. జాబ్ సాధించి లైఫ్ లో స్థిరపడాలనుకునే వారు…
ఆంధ్రప్రదేశ్‌లో ఓ తల్లి అందరికీ ఆదర్శంగా నిలిచారు.. తమకు కున్న నలుగురు కూతుళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దదారు.. చేసేది వ్యవసాయమే.. కష్టపడి నలుగురిని చదివించారు.. ఇక, వారి కష్టాన్ని ఏ మాత్రం వమ్ము చేయకుండా.. ఆ నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సగర్వంగా నిలిచారు.. దీంతో, ఆ తల్లి ఆనందానికి అవదలు లేకుండా పోయాయి..
డీఎస్సీ 2025 పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెబ్‌సైట్ లోకి మెరిట్ లిస్ట్ ను విడుదల చేసింది. రేపు ఉదయానికి సెలక్షన్ లిస్ట్ సిద్ధం చేసి రోస్టర్ పాయింట్స్ కి అనుగుణంగా ఎంపికైన అభ్యర్థులకు సమాచారం అందించనున్నారు అధికారులు. ఈ రాత్రికే అభ్యర్థులకు నేరుగా మొబైల్ ఫోన్ లకు సమాచారం ఇవ్వనున్నారు. 21 నుండి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 5 నాటికి పాఠశాలల్లో కి కొత్త ఉపాధ్యాయులు కొలవుదీరనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్…
Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందిస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది.…
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ నితీష్ కుమార్ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూ మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు నితీష్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా మూలంగా రాష్ట్రంలో సాగు యోగ్యమైన 1.49 కోట్ల ఎకరాలకు 69.70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 9 వేల కోట్లు వేశామని చెప్పారు. సన్నధాన్యం సాగు చేస్తున్న రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్…
జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. జూన్ నెలలో పలు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కు దరఖాస్తు గడువు ముగియనున్నది. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో లీగల్ ఆఫీసర్, ఆపరేషన్ ఆఫీసర్, సెయిలర్ (డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్) ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోండి. Also Read:Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త.. హరీష్…
స్పోర్ట్స్ బాగా ఆడేవారికి సువర్ణావకాశం. హెడ్ కానిస్టేబుల్ జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా కింద హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 403 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పురుష, మహిళా ప్రతిభావంతులైన క్రీడాకారులు అప్లై చేసుకోవచ్చు. Also Read:Anasuya : మా ఇంటికి హనుమాన్ వచ్చాడు.. కొత్త ఇంట్లో అనసూయ కంటతడి.. దరఖాస్తుదారులు గుర్తింపు…