హరిహర వీరమల్లు సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తోంది. పవన్ హేటర్స్‌తో పాటు ఆయన పొలిటికల్ అపోనెంట్స్ అకౌంట్‌ల నుంచి ఈ బాయ్‌కాట్ ట్రెండ్ గట్టిగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు.
Also Read:Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది!
“ఏదో బాయ్‌కాట్ ట్రెండ్ వినిపిస్తోంది, చేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, మీ సినిమాలు ఆడనివ్వము, నిన్ను రోడ్డు ఎక్కనివ్వము అంటే, నేను ఎక్కడో నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగిన వాడిని. ఇక్కడి దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాని ఆపుతున్నానంటే, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరే చెబుతున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెబుతున్నారు. ఎవడో ఒక హీరో సినిమా తీస్తే, ఆ సినిమా మిమ్మల్ని భయపెట్టే స్థాయిలో ఉందా? ఇదేమైనా క్విట్ ఇండియా మూవ్‌మెంట్ ఆ? ఏం చేస్తారో చేసుకోండి. ఏం ఫరక్ పడదు, ఏమీ తేడా పడదు. ఇవన్నీ చూడకుండా జీవితంలో ఈ స్థాయికి వస్తామా? ఇంతకు మించి చూసాం.
Also Read:Pawan Kalyan: హరిహర వీరమల్లు 2 రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా!
డబ్బులు తినకుండా ఈ స్థాయికి వస్తామా? ముఖ్యంగా ఇలాంటి తాటాకు చప్పుళ్లకి బెదురుతామా? నా అభిమానులకు చెబుతున్నాను, ఈ రోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే అది మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేనేం చేశాను నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు. ధైర్యంగా ఉండటమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు, ఎందుకంటే మనకు బతకడమే చాలా అద్భుతమైన విషయం అనిపిస్తూ ఉంటుంది, సక్సెస్ కంటే ఎక్కువగా. అందుకే నాకు డిప్రెషన్ ఉండదు. నా కొడుకు ఇంట్లో డిప్రెషన్‌గా ఉందంటే, ఒక రోజు అన్నం మానేయ్‌రా అని చెబుతాను, ఎందుకంటే డిప్రెషన్ అనేది మనం క్రియేట్ చేసుకునేది. సినిమా గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారని నాకు చెప్పితే, అవును, మనం బలంగా ఉన్నాం కాబట్టి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారని చెప్పాను. ఔరంగజేబుని అంటే చాలామందికి బాధలు, కోపాలు వస్తే రానీయండి. మొగల్స్ గొప్పతనం చెప్పినప్పుడు, మొగల్స్ చేసిన అన్యాయాలు, అక్రమాలు కూడా చెప్పాలి కదా,” అని పవన్ అన్నారు.