Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందిస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది.…