కేసీఆర్‌పై ఆరోపణలు, విమర్శలు చేసి గెలవాలంటే అది సాధ్యం కాదని.. కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమిస్తేనే అది సాధ్యమంటూ సలహా ఇచ్చారు మంత్రి కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో ఇవాళ సింగరేణి బీఎంఎస్ ప్రిసెడెంట్ మల్లయ్య.. టీఆర్ఎస్‌లో చేరారు.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సందర్భంగా విపక్షాలపై సెటైర్లు వేశారు.. మార్కెట్ లోకి కొత్త బిచ్చగాళ్ల వచ్చారు… వాళ్లు ఎవరో మీకు తెలుసన్నారు.. నిన్న మొన్న పదవులు వచ్చినవాళ్లు సీఎం కేసీఆర్‌పై ఎగిరెగిరి పడుతున్నారని ఫైర్ అయ్యారు.. కేసీఆర్ ను గెలవాలంటే… కేసీఆర్ కంటే ఎక్కువగా తెలంగాణను ప్రేమించడం నేర్చుకోవాలని హితవు పలికిన ఆయన.. కేసీఆర్ తో తలపడడానికి డైలాగులు కొడితే సరిపోదన్నారు. వైఎస్సార్, చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డితో తెలంగాణ కోసం కేసీఆర్ కొట్లాడారని గుర్తు చేశారు.. కేసీఆర్‌ను తిట్టడం శునకానందం అని ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. దుబ్బాక, జీహెచ్ఎంసీలో నాలుగు సీట్లు గెలిచే సరికి బీజేపీ నేతలు ఎగిరెగిరి పడ్డారని.. నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, 7 మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక.. వారికి అసలు విషయం అర్థమైందన్నారు. ఇక, తెలంగాణలో పోటాపోటీ పాదయాత్రల సీజన్ మొదలైందని.. పాదయాత్రలు చేసేందుకు నలుగురైదుగురు లైన్ లో ఉన్నారని సెటైర్లు వేశారు కేటీఆర్.