రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Health Tips : వర్షాకాలంలో జనాలు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కొంతమంది వీటిని చాలా లైట్‌గా తీసుకొని, అవి తీవ్రరూపం దాల్చిన తర్వాత అనేక అవస్థలు పడుతారు. ఈ జలుబు, దగ్గు విషయంలో ముందు నుంచే అప్రమత్తత పాటిస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది. అసలు ఈ సమస్యల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, జలుబు, దగ్గు దరిదాపుల్లోకి రాకుండా ఎలా నివారించాలో పరిశీలిద్దాం. వర్షకాలంలో గాలిలో ఉండే…
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను…
ప్రతీ సంవత్సరం మృగశిర కార్తె ప్రారంభం రోజున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కూడా చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి చేప మందు కోసం ఆస్తమా బాధితులు వచ్చారు. మృగశిర కార్తె రోజే చేపమందు ఎందుకు పంపిణీ చేస్తారు..? అనే ప్రశ్న అందరి…
చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు…
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. డెంగ్యూ, చికున్ గున్యా, వైరల్ జ్వరాలతో వివిధ ఆసుపత్రుల్లో పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాదులు రాకముందే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రే ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
పల్నాడు జిల్లాలో మరొకసారి మంత్రి నారాయణ పర్యటించుకున్నారు ….పిడుగురాళ్ల ప్రాంతంలో డయేరియా ప్రభలి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రెండు రోజుల క్రితం పలనాడు ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు ….అక్కడ తీసుకుంటున్న చర్యలతో పాటు, తీసుకోవలసిన చర్యలపై కూడా అధికారులకు నిజానిర్దేశం చేశారు… అయినప్పటికీ డయేరియా అదుపులోకి రాకపోవడంతో, నేడు మరొకసారి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించనున్నారు మంత్రి… నిన్న ఒక్కరోజే 21 కేసులు నమోదవడంతో ప్రభుత్వం…
పల్నాడును డయేరియా వణికిస్తోంది. గడిచిన 15 రోజులుగా డయేరియాతో పాటు ఇతర అనారోగ్య కారణాలతో ఏడుగురు మృతి చెందారు. డయేరియా కారణాలతో నలుగురు , ఇతర అనారోగ్య కారణాలతో, ముగ్గురు మరణించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. పిడుగురాళ్ల , మారుతి నగర్ , లెనిన్ నగర్ ప్రాంతాల్లో డయేరియా విజృంభించినట్లు అధికారులు వెల్లడించారు. పల్నాడులో గడిచిన రెండు వారాలుగా డయేరియా ప్రభావంతో 160 మంది కి పైగా ప్రజలు అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. 100 మందికి పైగా…