Maoists: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలో ప్రారంభించిన ‘ఆపరేషన్ కగార్’తో తమకు భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్న మరోసారి పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు.
Maoist Party Telangana: ఇటీవల మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలిసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖ విడుదల విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు శిక్ష తప్పదంటూ హెచ్చరించింది. రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. "విప్లవోద్యమానికి ద్రోహం చేసిన మల్లోజుల, ఆశన్నలకు అమరుల సాక్షిగా శిక్ష తప్పదని శపథం చేస్తున్నాం. పార్టీ చరిత్రలో ఎన్నడూ జరగని తీవ్రమైన…
Kishan Reddy : నక్సలిజం నిర్మూలనలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజం హింసను పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ లో భాగంగా వందలాదిమంది నక్సలైట్లు హింస మార్గాన్ని వదిలి సాధారణ జనజీవనంలో కలవడాన్ని కిషన్ రెడ్డి స్వాగతించారు. గత మూడు రోజుల్లోనే 300 మందికి పైగా నక్సలైట్లు అధికారాల వద్దకు వచ్చారని కిషన్ రెడ్డి…
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో యాభై ఏళ్ల చరిత్ర ఉన్న మావోయిస్టు పార్టీ కేడర్ కకావికలం అవుతోంది. భద్రతా దళాల నిరంతర ఎన్‌కౌంటర్‌లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఉత్తర బస్తర్ డివిజన్ ఇన్‌ఛార్జి రాజ్ మాన్ లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు ఉరఫ్ అభయ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట సరెండర్ అయ్యారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత ఆశన్న అలియాస్…
Maoist Chief: వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరుతో ఆపరేషన్ చేపట్టి అడవులను జల్లడపతున్నాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా మే 21న నారాయణపూర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ నిజంగా మావోస్టులకు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. ఎన్‌కౌంటర్‌లో ఏకంగా మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజ్ చనిపోయారు. మావోయిస్టు చరిత్రలో…
Gadchiroli : మహారాష్ట్రలోని గడ్చిరోలి-నారాయణ్‌పూర్ సరిహద్దులోని కోపర్షి అటవీ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. 19 C60 యూనిట్లు CRPF QAT 02 యూనిట్ల ఆపరేషన్ కొనసాగుతోంది. దాదాపు 8 గంటల పాలు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. చనిపోయిన వారిలో ఒక పురుషుడు, ముగ్గురు స్త్రీలు ఉన్నట్టు తెలుస్తోంది. 4 ఆయుధాలతో పాటు – 01 SLR రైఫిల్, 02 INSAS రైఫిల్స్ , 01.303 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు…
TPCC Mahesh Goud : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌పై రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన వెంటనే తనపై అర్బన్ నక్సలైట్, దేశద్రోహి ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. గురువారం సీపీఐ మఖ్దూమ్ కార్యాలయ పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ, మఖ్దూమ్ తెలుగు నేలపై జన్మించిన గొప్ప కమ్యూనిస్టు నేత అని కొనియాడారు.…
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఆమె, ముఖ్యమంత్రి చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపి, సమస్యకు పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. “బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరగదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతుండగా, గోదావరి జలాలను తరలించేందుకు కేసీఆర్ అప్పుడు ఒప్పుకున్నారని చెబుతున్నారు.…
Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్…