Maoists Free State : తెలంగాణ రాష్ట్రాన్ని అతి త్వరలోనే ‘మావోయిస్టు రహిత రాష్ట్రం’గా ప్రకటించేందుకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన కేవలం 17 మంది కీలక మావోయిస్టు నేతలు మాత్రమే మిగిలి ఉన్నారని, వారు కూడా లొంగిపోతే రాష్ట్రం పూర్తిస్థాయిలో మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం, అండర్ గ్రౌండ్‌లో ఉన్న ఈ 17 మంది నేతలపై ప్రభుత్వం…
Maoists Surrender : తెలంగాణ మావోయిస్టు ఉద్యమ చరిత్రలో ఒక కీలక మలుపుగా భావించదగ్గ పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాల కాలంగా సాయుధ పోరాటమే మార్గంగా పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సైనిక విభాగం అయిన పీపుల్స్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ (PGLA) చీఫ్ బర్సె దేవా, మరో 48 మంది అనుచరులతో కలిసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోవడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ…
Maoist Leader: ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండటం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆశన్న ప్రముఖుడు. అయితే.. 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు (ఆశన్న ) బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో చురుకుగా పని చేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…
Maoist Arrest : తెలంగాణలోని బీర్‌పూర్ గ్రామానికి చెందిన సీనియర్ నక్సలైట్ నాయకుడు, ప్రభాకర్‌గా ప్రసిద్ధి చెందిన బల్మూరి నారాయణరావును ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. నారాయణరావు నాలుగు దశాబ్దాలుగా అండర్‌గ్రౌండ్‌గా ఉన్నారు , సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా ఉన్న మరో అగ్ర నక్సల్ నాయకుడు ముప్పాల లక్ష్మణరావుకు దగ్గరి బంధువు. లక్ష్మణరావు కూడా బీర్‌పూర్ గ్రామానికి చెందినవాడు. అరెస్టయిన మావోయిస్టు నాయకుడు మావోయిస్టు పార్టీకి చెందిన మొబైల్ పొలిటికల్ స్కూల్ (మోపోస్) ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు,…