Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj: లంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 15 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ ఈ మ్యాచ్‌ను ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. అయితే సిరాజ్ బ్యాటింగ్ ప్రదర్శన వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజున టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. సిరాజ్‌తో ప్రత్యేకంగా బ్యాటింగ్ సెషన్ నిర్వహించాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడిగా ఎలాంటి షాట్లు ఆడాలి, బంతిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై రాహుల్ సిరాజ్‌కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
రాహుల్ నుంచి బ్యాటింగ్ మెళకువలు నేర్చుకున్న మరుసటి రోజే సిరాజ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. భారత్ విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరమైన సమయంలో క్రీజులోకి వచ్చిన సిరాజ్.. కేసర నువంత వేసిన తొలి మూడు బంతులను వరుసగా సిక్సర్లుగా మలిచాడు. దీంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయాన్ని అందుకుంది. మొదటి బంతిని డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్‌గా తరలించిన సిరాజ్.. రెండో బంతికి నేరుగా భారీ షాట్ ఆడాడు. మూడో బంతిని మిడ్‌వికెట్ మీదుగా బౌండరీ దాటించి మ్యాచ్‌ను ముగించాడు. సిరాజ్ బ్యాటింగ్ చూసిన అభిమానులు అతడిని సరదాగా ‘సర్ వివియన్ సిరాజ్’ అంటూ ప్రశంసిస్తున్నారు.
Also Read
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
ఈ ప్రాక్టీస్ మ్యాచ్ భారత జట్టుకు పలు సానుకూల అంశాలను అందించింది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అవసరమైన సమయంలో పరుగులు చేయగలరనే నమ్మకం పెరిగింది. అంతకుముందు గర్నూర్ బ్రార్ కూడా బ్యాట్‌తో మెరిపించడంతో భారత టెయిల్ ఎండర్లలో బ్యాటింగ్ సామర్థ్యం ఉందనే విషయం స్పష్టమైంది. ఇక, భారత్, శ్రీలంక మధ్య తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి గాలేలో ప్రారంభం కానుంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సిరాజ్ బ్యాటింగ్ ప్రదర్శన జట్టుకు అదనపు ఉత్సాహాన్ని ఇచ్చింది. గాలేలో స్పిన్‌కు అనుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో లోయర్ ఆర్డర్ నుంచి వచ్చే కీలక పరుగులు భారత విజయావకాశాల్లో ముఖ్యపాత్ర పోషించవచ్చు.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!