Naresh- Pavitra: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక జంటపై రూమర్స్ వచ్చాయంటే.. వారిద్దరూ ఎక్కడ కనిపించినా వారి పెళ్లి గురించే మాట్లాడుకుంటారు. ఏదైనా సినిమా షూట్ లో ఆ జంట పెళ్లి సీన్ చేసినా అది నిజమాని అనుకుంటారు. ఇక కొంతమంది ఆ పెళ్లి ఫోటోలను షేర్ చేసి నెటిజన్స్ ను ఆట పట్టిస్తూ ఉంటారు. అది కేవలం షూటింగ్ కోసమే అని తరువాత తీరిగ్గా చెప్పుకొస్తారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్- నటి పవిత్రా పెళ్లి కూడా అలాంటిదే అని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. సీనియర్ నటుడు నరేష్.. నటి పవిత్రా లోకేష్ ను నాలుగో పెళ్లి చేసుకుంటున్నాడు అనే వార్తతో ఈ వివాదం మొదలయ్యింది. ఆ తరువాత వీరిద్దరి మధ్య బంధం బట్టబయలు అయ్యింది. తామిద్దరం స్నేహితులు అని మొదట చెప్పుకొచ్చినా కొత్త సంవత్సరం రోజున లిప్ లాక్ తో తమ బంధాన్ని బయటపెట్టారు. ఇక అప్పటినుంచి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా..? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక నేడు తామిద్దరం వివాహ బంధంతో ఒక్కటి అయ్యామని నరేష్ ఒక వీడియోను పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది. హిందూ సంప్రదాయబద్ధంగా నరేష్, పవిత్ర మెడలో మూడు ముళ్లు వేశాడు. అందుకు సంబందించిన వీడియోను నరేష్ పోస్ట్ చేస్తూ.. పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. మా కొత్త జీవితానికి మీ అందరి ఆశీస్సులు కావాలి అని కోరాడు. దీంతో అభిమానులందరూ కంగ్రాట్స్.. సంతోషంగా ఉండండి అంటూ కామెంట్స్ పెట్టుకొచ్చారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం నరేష్- పవిత్ర ది నిజమైన పెళ్లి కాదట. ఒక సినిమా కోసం వీరు ఈ పెళ్లి షూట్ చేశారట. ఈ షూట్ అయిన గంట తరువాత నరేష్ ఆ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అంటున్నారు. దీంతో నెటిజన్స్ ఈ జంట పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు మీ కంటికి పిచ్చోళ్లలా కనిపిస్తున్నారా..? అని కొందరు.. నరేష్ కు ఇంకా విడాకులు కాలేదు కదా నాలుగో పెళ్లి చేసుకున్నాడు అంటే నమ్మడం కష్టమే అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. లేకపోతే ఈ పెళ్లినే నిజం పెళ్లిలా భావించి ఈ జంట కొత్త కాపురం మొదలుపెట్టనుందా..? అనేది తెలియాల్సి ఉంది.
Seeking your blessings for a life time of peace & joy in this new journey of us🤗
ఒక పవిత్ర బంధం
రెండు మనసులు
మూడు ముళ్ళు
ఏడు అడుగులు 🙏మీ ఆశీస్సులు కోరుకుంటూ ఇట్లు
– మీ #PavitraNaresh ❤️ pic.twitter.com/f26dgXXl6g— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 10, 2023