DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
- వరంగల్ నిట్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష
- డ్రగ్స్, సైబర్ నేరాలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- సైబర్ మోసాల్లో రూ.1,750 కోట్లు నష్టం
- విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Anand : తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు ప్రధాన సవాలుగా ఉన్న నక్సలిజం పూర్తిగా అంతరించిందని, ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ , సైబర్ నేరాలే అతిపెద్ద సమస్యలుగా పరిణమించాయని రాష్ట్ర డీజీపీ ఆనంద్ స్పష్టం చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా వరంగల్ నిట్ (NIT) ప్రాంగణంలో పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ, తన ఐపీఎస్ శిక్షణ వరంగల్‌లోనే జరిగిందని, అప్పట్లో నక్సలైట్ల భయాలు, దాడులు , కూంబింగ్ ఆపరేషన్లతో కాలం గడిపామని తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం.. టీజీ వీర్ యాప్ ప్రారంభం
అదృష్టవశాత్తూ రాష్ట్రంలో మావోయిజం పూర్తిగా సమసిపోయిందని, కీలక నేతలతో పాటు క్యాడర్ కూడా లొంగిపోయిందని డీజీపీ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పాలసీ ప్రకారం సహాయం అందించి పునరావాసం కల్పించడమే తమ ముందున్న తదుపరి సవాలని చెప్పారు. అలాగే మావోయిస్టు దాడుల్లో మృతిచెందిన బాధిత కుటుంబాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ‘టీజీ వీర్’ (TG Veer) అనే ప్రత్యేక అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఇక గతంలో నక్సలైట్ల సమస్య కారణంగా రాజకీయ నాయకులకు ఇచ్చిన సెక్యూరిటీపై ప్రస్తుతం రివ్యూ జరుగుతోందని, అవసరం లేని వారికి భద్రత తగ్గించామని వివరించారు. దీనిని ఎవరూ రాజకీయం చేయకూడదని, ప్రభుత్వ సొమ్ము వృథా కాకుండా చూడటంలో భాగంగానే స్వయంగా తాను కూడా తన సెక్యూరిటీని తగ్గించుకున్నానని పేర్కొన్నారు.
Also Read
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
- Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
- OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
సైబర్ క్రైమ్స్, డ్రగ్స్‌పై కఠిన చర్యలు.. విద్యాసంస్థలకూ బాధ్యత
సమాజంలో ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ సెక్యూరిటీ, ట్రాఫిక్ , ఆర్థిక నేరాలు ప్రధాన సమస్యలుగా మారాయని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులు అధిక లాభాల ఆశతో సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.1,750 కోట్లు కోల్పోయారని, వీరిలో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఐతే సైబర్ నేరాల ఛేదనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. డ్రగ్స్ సమస్య పట్టణాల నుంచి గ్రామాలకు పాకుతోందని, విద్యాసంస్థల్లో మత్తు పదార్థాలు తీసుకునే వారిని తాము గుర్తిస్తున్నప్పటికీ యాజమాన్యాలు సరిగా స్పందించడం లేదని, దీనిపై ప్రభుత్వ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్‌లు, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల నేరాలు పెరుగుతున్నాయని, వీటి నియంత్రణకు పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని డీజీపీ తెలిపారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..