తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. గత బులెటిన్‌తో పోలిస్తే.. 700కు పైగా కోసులు తగ్గినా.. ఇంకా భారీగానే కొత్త కేసులు వెలుగు చూశాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,867 శాంపిల్స్ పరీక్షించగా.. 3,801 కేసులు పాజిటివ్‌గా తేలాయి.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ టెస్ట్‌ల సంఖ్య కూడా భారీగానే తగ్గిపోయింది.. మరో కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదలగా.. 2,046 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 32,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇక, పాజిటివ్ కేసుల సంఖ్య 7,47,155కు పెరిగితే.. రికవరీ కేసులు 7,05,054కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 4,078 మంది ప్రాణాలు వదిలనట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.