జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ మధ్య ఎక్కడ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడినా.. జాతీయ పార్టీ గురించే ప్రస్తావిస్తున్నారు.. జాతీయ రాజకీయాల్లో జెండా ఎత్తుదామా? మీరు నాకు తోడుగా ఉంటారా? యుద్ధం చేద్దామా? పట్టు పడదామా? అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తూ.. వారి నుంచే సమాధానం రాబడుతున్నారు.. అయితే, కేసీఆర్ జాతీయ పార్టీకి సమయం ఆసన్నమైంది.. తర్వలోనే జాతీయ పార్టీని ప్రకటించనున్నారు గులాబీ పార్టీ బాస్… హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని తెలుస్తుంది.
Read Also: Balapur Ganesh: బాలాపూర్ గణేష్ ప్రత్యేక ఏంటి..? లడ్డూకు అంత క్రేజ్ ఎందుకు..?
జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ చేసిన కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పలు దపాలుగా మంతనాలు జరిపిన కేసీఆర్.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపునిచ్చినట్ సమాచారం.. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’ లాంటి పేర్లను పరిశీలించి.. అందులో ఒక పేరును ఖరారు చేసే పనిలో ఉన్నారు.. అయితే, ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు కేసీఆర్.. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.. ఈ నెల 11వ తేదీన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. హైదరాబాద్ రానున్నారు.. ఆ తర్వాత కొత్త పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించే అవకాశం ఉంది.. అయితే, ఫ్రంట్‌లు, పొత్తుల లాంటి విషయాలపై జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాతే కేసీఆర్ దృష్టి సారిస్తారని తెలుస్తోంది.