టీఆర్ఎస్ పార్టీని స్థాపించి.. సాధ్యం కాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టిసారించారు.. దాని కోసం.. ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు, ఇప్పటికే వాడుతున్న గులాబీ రంగులను కొనసాగిస్తూ.. పార్టీ పేరును మాత్రం మార్రచేస్తున్నారు.. అనేక పేర్లు పరిశీలించిన చివరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు ఆయన మెగ్గు చూపినట్టు తెలుస్తోంది.. తెలంగాణ గడ్డపై ఆవిర్భవిస్తోన్న ఆ కొత్త పార్టీకి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం
తెలంగాణ గడ్డపై మరో కొత్త ఆవిర్భవించనుంది.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా తెలంగాణ రాష్ట్రానికే పరిమితమైన గులాబీ పార్టీ.. ఇప్పుడు జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతోంది.. టీఆర్ఎస్‌ను కాస్తా బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా మారుస్తూ ఇవాళ తీర్మానం చేయబోతున్నారు.. జాతీయ పార్టీకి ఏ పేరు పెట్టాలన్న దానిపై కొన్ని పేర్లను పరిశీలించిన తర్వాత చివరకు బీఆర్‌ఎస్‌కే గులాబీ దళపతి మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.. మొత్తంగా ఇవాళ తెలంగాణ గడ్డపై కొత్త పార్టీ పురుడు…
జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఈ మధ్య ఎక్కడ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడినా.. జాతీయ పార్టీ గురించే ప్రస్తావిస్తున్నారు.. జాతీయ రాజకీయాల్లో జెండా ఎత్తుదామా? మీరు నాకు తోడుగా ఉంటారా? యుద్ధం చేద్దామా? పట్టు పడదామా? అంటూ ప్రజల్ని ప్రశ్నిస్తూ.. వారి నుంచే సమాధానం రాబడుతున్నారు.. అయితే, కేసీఆర్ జాతీయ పార్టీకి సమయం ఆసన్నమైంది.. తర్వలోనే జాతీయ పార్టీని ప్రకటించనున్నారు గులాబీ పార్టీ బాస్… హైదరాబాద్ వేదికగానే…