Telangana BJP Leaders Filed Huge RTI Applications.
బీజేపీ సమాచార హక్కు దరఖాస్తుల ఉద్యమం నడుస్తోంది. వివిధ అంశాల పై సమాచారం ఇవ్వాలని వేలాదిగా దరఖాస్తులు పెడుతున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాలపై సమాచారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దరఖాస్తు పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ దరఖాస్తులు అండర్ ప్రాసెస్ లో ఉన్నాయని ఆయా శాఖలు రిప్లైలు ఇస్తుండటంతో బీజేపీ నేతలు వేల సంఖ్యలో సమాచార హక్కు ద్వారా దరఖాస్తులు చేస్తున్నారు. అయితే.. తాజాగా రాష్ట్రము లోని అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి లకు సమాచార హక్కు దరఖాస్తులు ఇచ్చారు బీజేపీ నేతలు. 12 వేలకు పైగా గ్రామాల్లో ఆర్‌టీఐ ద్వారా బీజేపీ నేతలు సమాచారం అడుగుతున్నారు.
Governor Tamilisai : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న గవర్నర్
ఈ నేపథ్యంలోనే.. దరఖాస్తులు సిద్దం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులు … ఖర్చు చేసిన వివరాలు.. గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం… వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఆయా గ్రామాలకు వచ్చిన నిధులు… లబ్ది దారుల వివరాలు.. హరిత హరం, గ్రామీణ ఉపాధి హామీ, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు తదితర వివరాలు బీజేపీ నేతలు అడుగుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ బైక్ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా బీజేపీ నేతలు పర్యటించనున్నారు.