BJP Bike Rally: తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నేడు ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామ వరకు బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు.
తెలంగాణలో అధికారమే లక్షంగా బీజేపీ నాయకులు దూకుడు పెంచారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ఆందోల్ నియోజకవర్గంలోని ప్రజాగోస-బీజేపీ భరోసా బైక్ ర్యాలీని రాయికోడ్ మండలంలోని సీరూర్ గ్రామంలో మాజీమంత్రి బాబూమోహన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరగనుంది. ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు సభలో పాల్గొంటారు. షాతో పాటు కర్ణాటకకు చెందిన పలువురు మంత్రులు కూడా హాజరుకానున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే కూడా ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. ఈ వేడుకలను ఏడాది పాటు నిర్వహిస్తామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు కేంద్ర ప్రభుత్వం…
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇవాళ మ.2గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. అనంతరం దివంగత కృష్ణంరాజు కుటుంబీకులకు పరామర్శించనున్నారు. అనంతరం ఫిల్మ్ నగర్ లో సంస్మరణ సభలో రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. తిరిగి సాయంత్రం 4.20 గంటలకు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు. Read also: What’s Today…