తెలంగాణ బీజేపీ నేతలు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్న తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు… కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు. అయితే.. గతంలోనే.. హోం శాఖ మంత్రి అమిత్ షా తో తెలంగాణ బీజేపీ పార్టీ ఎంపీలు, పార్టీ కీలక నేతలు భేటీ కావాల్సి ఉన్నా… ఆ సమయంలో.. సీడీఎస్ బిపిన్ రావత్ మరణించడంతో.. ఆ సమావేశం పోస్ట్ పోన్ అయింది.
ఇక తాజాగా మరో సారి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సమావేశం కానున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. ఇప్పటికే పలువురు నేతలు ఢిల్లీ వెళ్లగా.. రేపు కొందరు పయనం కానున్నారు. ఈ సమావేశంలో… తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్తితులు, ధాన్యం కోనుగోలు అంశం, టీఆర్ ఎస్ ను ఎలా ఎదుర్కొవాలనే దానిపై అమిత్ షా తో చర్చించనున్నారు.