Governor TamiliSai: అప్పటి వరకు ఆగకండి.. వయసు ఉన్నప్పుడే పెళ్లిచేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారి అధునాతన సింథటిక్ క్యాడవర్‌తో కూడిన స్కిల్ ల్యాబ్, బర్తింగ్ సిమ్యులేటర్ ఏర్పాటు చేయగా.. గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను మెడిసిన్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే వివాహం చేసుకున్నా.. మీరు కూడా వయసులో ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకోండి, చదువు అయిపోయేంత వరకు ఆగొద్దు’ అంటూ విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Read Also: PM Modi security: ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు..
Also Read
తాను చదువుకున్నప్పుడే వివాహం చేసుకున్నా అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులతో పాసైనట్టు గవర్నర్ తమిళిసై గుర్తు చేసుకున్నారు. కాబట్టి వైద్య విద్యార్థులందరూ వయసులో ఉండగానే వివాహం చేసుకోవాలని ఆమె సూచించారు. ఎంబీబీఎస్ పూర్తి చేయడం, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం, పీజీ పూర్తి చేయడం వంటి విషయాలను కూడా గవర్నర్ గుర్తుచేసుకున్నారు. కొందరు చదువు పేరుతో వివాహాలు ఆలస్యంగా చేసుకుని అనారోగ్యం పాలవుతున్నారని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లని కోటులో తనను డాక్టర్‌గా చూడాలని తన తల్లి పడిన తపనను గవర్నర్ వివరించారు. కాగా ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎయిమ్స్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రశంసించారు. సర్జరీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా సాధారణ ప్రసవాలు చేయాలని వైద్య విద్యార్థులకు కీలకంగా సూచించారు.
తాజావార్తలు
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్‌తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
-
Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!