Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లకు అక్రమ సొమ్మును దారిమళ్లించేందుకు అమాయకుల పేరిట ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాలను సమకూరుస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటను హైదరాబాద్ పోలీసులు కట్టడి చేశారు. చార్మినార్ జోన్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడిలో ముగ్గురు కీలక నిందితులు పట్టుబడగా, రాజస్థాన్‌కు చెందిన మరో ఇద్దరితో పాటు స్థానిక నిందితులు పరారీలో ఉన్నారు.
ఒక్కో ఖాతా రూ.25 వేలకు విక్రయం
హుస్సేనీ ఆలం షాగంజ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అబ్బాస్ ఉల్లా హుస్సేనీ (24), మహమ్మద్ తల్హా ఖాన్ (23), నవాబ్ మహమ్మద్ రహీముద్దీన్ ఖాన్ (20) ముఠాగా ఏర్పడ్డారు. వీరు స్థానిక అమాయకులకు డబ్బు ఆశ చూపి హైదరాబాద్‌లోని వివిధ సహకార, వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించారు. ఆ ఖాతాలకు సంబంధించిన పాస్ బుక్, ఏటీఎం కార్డు, పిన్ నంబర్, లింక్ చేసిన సిమ్ కార్డులతో కూడిన పూర్తి ‘బ్యాంక్ కిట్లను’ రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన బాబు లాల్, విజయ్‌లకు కొరియర్ ద్వారా పంపేవారు. ఒక్కో ఖాతాను రూ.20,000 నుంచి రూ.25,000 వరకు విక్రయిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు.
Also Read
- Meerpet : సీజ్ చేసిన ఫోన్, బంగారాన్ని కాజేసిన కానిస్టేబుల్ అరెస్ట్!
- Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
- Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
నగరవ్యాప్తంగా 83 ఖాతాలు.. రూ.10 కోట్ల లావాదేవీలు
నిందితులను అదుపులోకి తీసుకుని వారి మొబైల్ ఫోన్లు, 8 బ్యాంక్ పాస్ పుస్తకాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, దారుస్సలాం, అగ్రసేన్ వంటి దాదాపు 10కి పైగా బ్యాంకుల్లోని వివిధ బ్రాంచ్‌లలో మొత్తం 83 మ్యూల్ ఖాతాలను తెరిపించినట్లు తేలింది. ఈ డేటాను జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో పరిశీలించగా.. వీటిలో 11 ఖాతాలు దేశవ్యాప్తంగా (మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో) నమోదైన 14 భారీ సైబర్ మోసాలకు వినియోగించినట్లు స్పష్టమైంది. ఈ ఖాతాల ద్వారా సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.10,04,84,094/- అక్రమ లావాదేవీలు సాగించి, అదే రోజు సొమ్మును విత్‌డ్రా చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
చట్టపరమైన చర్యలు..
అత్తాపూర్, కల్వకుర్తి పోలీస్ స్టేషన్లలో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 319(2) తో పాటు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న బాబు లాల్, విజయ్, సల్మాన్, అన్నాల కోసం గాలింపు ముమ్మరం చేశారు. చార్మినార్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సి. యాదేందర్ నేతృత్వంలో ఎస్సైలు కె. రామారావు, ఎమ్. మహేష్, కె. శివకుమార్ బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
పోలీసుల హెచ్చరిక:
కమీషన్ల ఆశతో లేదా సులభంగా డబ్బు వస్తుందని మీ బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, సిమ్ కార్డులు, యూపీఐ ఐడీలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం గానీ, విక్రయించడం గానీ చేయవద్దు. అలా చేస్తే మీ ఖాతాలు ఫ్రీజ్ అవ్వడమే కాకుండా క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఎవరికైనా అనుమానం వస్తే వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ 1930 లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
-
Bank Holidays November 2026: నవంబర్‌లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!