Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raptadu School Attack: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన అమానుష దాడి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలోనే రంపంతో బాలికపై దాడికి తెగబడటం అత్యంత ఘోరమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన సీఎం, ఆమెకు అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని తక్షణమే పట్టుకుని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశిస్తూ, చిన్నారుల భద్రత విషయంలో ఇలాంటి ఘటనలను ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. ఇక, బాలిక బంధువులతో ఫోన్లో మాట్లాడారు సీఎం చంద్రబాబు.. దాడి చేసిన ఉన్మాదిని వదిలిపెట్టమని హామీ ఇచ్చారు.
అలాగే, ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. క్లాస్ రూమ్‌లోనే నెత్తుటి మడుగులో ఉన్న చిన్నారిని చూసి తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, కన్నీళ్లు ఆగడం లేదన్నారు. ఈ ఉన్మాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉంటాయని, పిల్లల భద్రతలో నిర్లక్ష్యం వహించే వారిని, బాధ్యులైన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. మరోవైపు హోం మంత్రి అనిత అనంతపురం జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇక ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సైతం స్పందిస్తూ, బాలికకు అత్యవసర, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Also Read
- Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
- Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
- Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
- Konaseema: తుఫాన్ విధ్వంసం.. కరెంట్ లేక అంధకారంలో 200 గ్రామాలు.. ప్రజల కష్టాలు వర్ణనాతీతం
తాజావార్తలు
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
-
Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!