Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: నగరంలో సంచలనం సృష్టించిన రూ.24 కోట్ల భారీ సైబర్ ట్రేడింగ్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌లోని మూడు కీలక ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రధాన నిందితుడు అలంరాజు సత్యనారాయణ మూర్తికి చెందిన నివాసాలు, వ్యాపార కార్యాలయాలే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగాయి. నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌తో వల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే స్వల్ప కాలంలోనే భారీ లాభాలు వస్తాయంటూ నిందితుడు బాధితులకు ఆశ చూపించాడు. ఫోన్ కాల్స్, సోషల్ మీడియా మెసేజ్‌ల ద్వారా నిమేష్ అనే బాధితుడిని సంప్రదించి, ఓ నకిలీ వెబ్సైట్ ద్వారా ట్రేడింగ్ చేయాల్సిందిగా నమ్మించాడు. బాధితుడిని పూర్తిగా బురిడీ కొట్టించి విడతల వారీగా ఏకంగా రూ.24,76,21,042 వసూలు చేశాడు. తీరా అసలు పెట్టుబడితో పాటు రావాల్సిన లాభాలను సైతం తిరిగి ఇవ్వకుండా మొహం చాటేశాడు.
2023 మే 23 నుంచి 2024 మే 27 మధ్య కాలంలో నిందితుడు ఏకంగా రూ.26.02 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు సాగించినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకునేందుకు, డబ్బు మూలాలను దాచేందుకు పలు ‘మ్యూల్’ బ్యాంకు ఖాతాల ద్వారా నిధులను మళ్లించాడు. ఆ సొమ్ముతో తన కుటుంబ సభ్యులు, ఉద్యోగుల పేర్లతో పలు వ్యాపార సంస్థలను ప్రారంభించాడు. ‘ఆశ్రిత ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్’ పేరిట హైదరాబాద్‌లో లగ్జరీ విల్లా ప్రాజెక్టును మొదలుపెట్టడంతో పాటు BTR ఇండస్ట్రీస్, వెలుగు ట్రేడింగ్ కంపెనీ, ఆశ్రిత మెగా సొల్యూషన్స్ పేర్లతో షెల్ కంపెనీలను నడిపినట్లు తేలింది.
Also Read
- Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
- INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
- Donald Trump: "అబ్దుల్.. నువ్వొక జిహాదీవి".. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
- Moinabad: కాలేజీ ఫెస్ట్ తర్వాత ఘోరం.. పొలంలో విద్యుత్ తీగలకు తగిలి ఇద్దరు విద్యార్థుల మృతి
సోదాల సందర్భంగా నిందితుడి నివాసం నుంచి రూ.6.40 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన 11 బ్యాంకు ఖాతాల్లో ఉన్న సుమారు రూ.14 లక్షల బ్యాలెన్స్‌ను తక్షణమే ఫ్రీజ్ చేశారు. వీటితో పాటు మోసపు సొమ్ముతో సమకూర్చుకున్న సుమారు రూ.5 కోట్ల విలువైన ప్లాట్లు, విల్లాను అధికారులు గుర్తించారు. తనిఖీల్లో లభించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకుని లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad: భారీ సైబర్ ట్రేడింగ్ మోసం.. రూ.24.76 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు.. 3 చోట్ల ఈడీ మెరుపు దాడులు!
-
Zakir Naik: జకీర్ నాయక్ వాదనను వ్యతిరేకించిన భారత్, పాక్, ఆఫ్ఘన్ మేధావులు.. అసలు ఏం జరిగిందంటే..?
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
-
Donald Trump: “అబ్దుల్.. నువ్వొక జిహాదీవి”.. డెమోక్రటిక్ అభ్యర్థిపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
NEC Lavie X14: 99.9Wh భారీ బ్యాటరీతో NEC Lavie X14 కొత్త ల్యాప్‌టాప్.. 30 గంటల బ్యాకప్, 32GB RAMతో అదుర్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!