Bank Holidays November 2026: నవంబర్లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bank Holidays November 2026: నవంబర్ నెలలో బ్యాంకుకు వెళ్లి ఏదైనా ముఖ్యమైన పని పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగా బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకోవడం మంచిది. నవంబర్ 2026లో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛఠ్ పూజ, గురునానక్ జయంతి వంటి పలు పండుగలు ఉన్నాయి. వీటి కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం, నవంబర్లో పండుగలతో పాటు రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పనిచేయవు. అయితే ఈ సెలవులన్నీ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండవు. కొన్ని సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలు, నగరాలకే వర్తిస్తాయి. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు మీ ప్రాంతంలోని సెలవుల జాబితాను పరిశీలించడం మంచిది.
నవంబర్ 2026లో బ్యాంకులకు సెలవులు ఉండే తేదీలు
నవంబర్ 1, ఆదివారం: దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 8, ఆదివారం: దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 9, సోమవారం: దీపావళి, లక్ష్మీ పూజ, గోవర్ధన పూజ, విశ్వకర్మ దినోత్సవం సందర్భంగా త్రిపుర, మధ్యప్రదేశ్, చండీగఢ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో సెలవు ఉంటుంది.
నవంబర్ 10, మంగళవారం: దీపావళి వేడుకలు, లక్ష్మీ పూజ, విక్రమ సంవత్ నూతన సంవత్సరం సందర్భంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు.
నవంబర్ 11, బుధవారం: లక్ష్మీ పూజ, నింగోల్ చకౌబా, భాయ్ దూజ్, చిత్రగుప్త జయంతి సందర్భంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో సెలవు ఉంటుంది.
నవంబర్ 13, శుక్రవారం: వంగాల పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 14, శనివారం: రెండో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 15, ఆదివారం: దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 16, సోమవారం: ఛత్ పూజ సందర్భంగా బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 20, శుక్రవారం: ఇగాస్ బగ్వాల్ పండుగ సందర్భంగా ఉత్తరాఖండ్లో బ్యాంకులు పనిచేయవు.
నవంబర్ 22, ఆదివారం: దేశవ్యాప్తంగా సెలవు
నవంబర్ 23, సోమవారం: సెంగ్ కుట్ స్నెమ్ పండుగ సందర్భంగా.. మేఘాలయలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 24, మంగళవారం: గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రాస్ పౌర్ణిమ సందర్భంగా.. తెలంగాణతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
నవంబర్ 27, శుక్రవారం: కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూసి ఉంటాయి.
నవంబర్ 28, శనివారం: నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు.
నవంబర్ 29, ఆదివారం: దేశవ్యాప్తంగా సెలవు
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ మోసాల్లో డబ్బు పోతే బ్యాంకులే పరిహారం చెల్లించాలి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- DA Hike 2026: జీతం, పెన్షన్, బకాయిలు.. 3% డిఏ/డిఆర్ పెంపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
- Diwali Bonus: దీపావళి ధమాకా.. ఆ ఉద్యోగులకు భారీగా బోనస్!
- Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
బ్యాంకులకు సెలవు ఉన్నా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి
బ్యాంకులకు సెలవు ఉన్న రోజుల్లో కూడా ఖాతాదారులు కొన్ని బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా డిజిటల్ లావాదేవీలు నిర్వహించవచ్చు. అలాగే ATMల ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చు. అయితే చెక్కులు జమ చేయడం, డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవడం, బ్యాంకు శాఖకు వెళ్లి పూర్తి చేయాల్సిన ఇతర పనులకు సెలవు ముగిసే వరకు వేచి ఉండాల్సి రావచ్చు. కాబట్టి నవంబర్ నెలలో బ్యాంకుకు వెళ్లి ముఖ్యమైన పనులు చేయాలనుకునే వారు సెలవుల తేదీలను ముందుగానే పరిశీలించి తమ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Bank Holidays November 2026: నవంబర్లో భారీగా బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే, ముందే తెలుసుకోండి!
-
Raptadu School Attack: “కన్నీళ్లు ఆగడం లేదు”.. రాప్తాడు ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సీరియస్
-
Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
-
Mule Accounts : సైబర్ నేరగాళ్లకు ‘మ్యూల్’ ఖాతాల విక్రయం… అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు, ముగ్గురు అరెస్ట్!
-
Raptadu School Attack: బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి ఘటన.. నిందితుడిని పట్టుకున్న పోలీసులు?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!