Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shreyas Iyer Toss Record: టీమిండియా కెప్టెన్, సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ టాస్‌లలో తన అదృష్టాన్ని కొనసాగిస్తున్నాడు. మైదానంలో మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా టాస్ గెలవడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ టాస్ గెలవడంతో.. మరో టాస్ విజయాన్ని శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా తొలి 25 మ్యాచ్‌ల్లో అత్యధిక టాస్‌లు గెలిచిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.
శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 25 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో ఏకంగా 19 మ్యాచ్‌ల్లో టాస్ గెలవడం విశేషం. అంటే కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ టాస్ విషయంలో శ్రేయస్‌కు అదృష్టం కలిసొస్తోంది. న్యూజిలాండ్‌తో నాలుగో టీ20లో టాస్ గెలవడం ద్వారా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఈ జాబితాలో శ్రేయస్ తర్వాత వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ, పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ఉన్నారు. వీరిద్దరూ తమ తొలి 25 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో కెప్టెన్లుగా 17 సార్లు టాస్ గెలిచారు. వీరిని అధిగమించిన శ్రేయస్ 19 టాస్ విజయాలతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు.
Also Read
- IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
- Mumbai Indians: ఎంఐలో సంచలన మార్పులు.. బ్యాటింగ్ కోచ్‌గా ఉత్తప్ప.. మలింగ స్థానంలో మిచెల్, కొత్త కోచింగ్ స్టాఫ్ ఇదే..
- ENG vs SL: వరుసగా 3 ఓటములు.. బెన్ డకెట్ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ ఘన విజయం..!
- India vs Pakistan: నేడే భారత్ vs పాకిస్థాన్ సమరం.. కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే..
ఇప్పటికే వరుసగా టాస్‌లు గెలుస్తూ వార్తల్లో నిలిచిన శ్రేయస్ అయ్యర్.. తాజా ఘనతతో మరోసారి క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. టాస్ గెలవడం మ్యాచ్‌లో సగం విజయం సాధించినట్లేనని క్రికెట్లో సరదాగా అంటుంటారు. టాస్‌లలో అదృష్టం కొనసాగిస్తున్న శ్రేయస్.. కెప్టెన్‌గా కూడా జట్టుకు మంచి విజయాలు అందిస్తున్నాడు. కెప్టెన్సీ చేపట్టిన ఆరంభంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో తేలిపోయినా.. జింబాంబ్వేపై విజయాలతో గాడిలో పడ్డాడు. జింబాంబ్వే, ఆఫ్గనిస్తాన్, వెస్టిండీస్, ఏషియన్ గేమ్స్ 2026, న్యూజిలాండ్‌పై సిరీస్‌లు గెలిచాడు. కెప్టెన్‌గా మాత్రమే కాదు.. అటు బ్యాటర్‌గా కూడా సర్పంచ్ సాబ్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజావార్తలు
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Terror Funding Case: జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ ఫండింగ్ ముఠా గుట్టురట్టు.. 10 మంది అరెస్ట్
-
World Bank Report: పేదరిక నిర్మూలనలో భారత్ రికార్డు.. 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి విముక్తి.. కానీ..
-
Telangana Food Safety: తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 9 సంస్థల లైసెన్సులు రద్దు..
-
PM Kisan 24th Installment Out: పీఎం కిసాన్ 24వ విడత విడుదల.. మీ ఖాతాలో రూ.2,000 పడ్డాయా? స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ట్రెండింగ్
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!