Jio Voice Only Plans: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.147 నుంచే వాయిస్ ఓన్లీ ప్లాన్స్! వ్యాలిడిటీ వివరాలివే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Voice Only Plans: దేశీయ టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ రిలయన్స్ జియో వినియోగదారుల కోసం కొత్త వాయిస్ ఓన్లీ (Voice Only) ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే ఉపయోగించుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి. ఈ కొత్త ప్లాన్ల ధరలు రూ.147 నుంచి ప్రారంభమవుతున్నాయి.
టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ (TRAI) సూచనల నేపథ్యంలో జియో ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎయిర్టెల్ కూడా వాయిస్ ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు జియో కూడా ఇదే తరహాలో ప్రత్యేక ప్లాన్లను తీసుకురావడంతో డేటా అవసరం లేని వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ లభించనున్నాయి.
Also Read
- 200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
- 200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
- GTA 6 Pre-Orders: ఆడకముందే రూ. 11,000 కోట్లు.. రిలీజ్‌కు ముందే GTA 6 ఊచకోత! అసలు కథ ఇదే..
- ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
జియో వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్ల ధరలు
జియో తన వాయిస్ ఓన్లీ ప్లాన్లను వేర్వేరు వ్యాలిడిటీ ఆప్షన్లతో అందిస్తోంది. తక్కువ రోజుల నుంచి దాదాపు ఏడాది వరకు వ్యాలిడిటీ ఉండే ప్లాన్లు ఉన్నాయి.
రూ.147 – 22 Days వ్యాలిడిటీ 300 SMS
రూ.177 – 28 Days వ్యాలిడిటీ 300 SMS
రూ.196 – 30 Days వ్యాలిడిటీ 300 SMS
రూ.197 – 1 Calendar Month వ్యాలిడిటీ 300 SMS
రూ.448 – 84 Days వ్యాలిడిటీ 1,000 SMS
రూ.1,748 – 336 Days వ్యాలిడిటీ 3,600 SMS
ఈ ప్లాన్లలో దేశవ్యాప్తంగా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంటుంది. అయితే వీటిలో మొబైల్ ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉండదు. కొన్ని ఎంపిక చేసిన ప్లాన్లతో జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ వంటి అదనపు సేవలు కూడా లభించనున్నాయి.
ఎవరికి ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి?
ప్రధానంగా ఇంటర్నెట్ డేటా అవసరం లేని వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని జియో ఈ ప్లాన్లను రూపొందించింది.
ఫీచర్ ఫోన్లు ఉపయోగించే వారికి.
ప్రధానంగా ఫోన్ కాల్స్ కోసం సిమ్ వినియోగించే వారికి.
రెండో సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి.
ఇంటర్నెట్ కోసం ఎక్కువగా వైఫైపై ఆధారపడే వారికి.
మొబైల్ డేటా అవసరం లేకుండా కాలింగ్, SMS మాత్రమే ఉపయోగించేవారికి.
సాధారణ ప్రీపెయిడ్ ప్లాన్లలో కాలింగ్‌తో పాటు రోజువారీ లేదా నిర్దిష్ట పరిమాణంలో డేటా కూడా ఉంటుంది. అయితే డేటా ఉపయోగించని వినియోగదారులు కూడా ఆ డేటా కోసం డబ్బు చెల్లించాల్సి వచ్చేది. కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్లతో అలాంటి అదనపు ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
CSK-IPL 2027: ధోనీ గుడ్‌బై.. జట్టులోకి ఇద్దరు డేంజర్ ప్లేయర్స్.. సీఎస్కే రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.51 లక్షలు.. దక్కించుకున్న జనసేన నేత
-
Ganja Racket Busted: కూరగాయల వ్యాపారం మాటున గలీజు దందా.. భారీగా గంజాయి, నగదు స్వాధీనం..!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!
-
MS Dhoni IPL Retirement: నా ఆలోచన తప్పు అని ఫాన్స్ నిరూపించారు.. ఎంఎస్ ధోనీ ఎమోషనల్ పోస్ట్!