ట్యాక్స్ రెవెన్యూ 40 వేళా కోట్లు చూపెట్టారని, దీనిపై ట్యాక్స్ వేశారా... వేయాలని ఆలోచిస్తున్నారా..?అంటూ శాసనమండలిలో బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. దేశ సంపద దోపిడీకి గురి అవతోందని ఆగ్రహంమం వ్యక్తం చేశారు. 41 వేల కోట్లు గ్రాంట్స్ అంచనా వేసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 8 వేల కోట్లు దాటలేదన్నారు.
శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ ప్రవేశపెట్టారు. విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు జరుగలేదని అన్నారు.
అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రం పై ఫైర్ అయ్యారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డాం అన్నారు. ఇది మహాత్మగాంధీ పుట్టిన నేలనేనా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్…