తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేని.. ఎవరు ఎదుర్కోలేరని సీఎం రేవంత్‌రెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. జులై 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది.