బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం జరగనుంది.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది.
జాతీయ పార్టీ ఏర్పాటుపై ఇవాళ తెరాస నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండాపై స్పష్టతనిచ్చే అవకాశముంది. దసరా నాడు ప్రకటించనుండడంతో ఏం చేయాలనే దానిపై దృష్టి సారించారు గులాబీ బాస్.
తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల తమిళనాడు సీఎం స్టాలిన్, లెఫ్ట్ పార్టీల నేతలతో కేసీఆర్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌తో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కుమారుడు…
తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షత విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు జనాల్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా మీరు జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరని ఎమ్మెల్యేలకు చురకలు అంటించారు. రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టండని, కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు చెప్పండని వివరించారు. కేంద్రం చేతులెత్తేసింది…
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ఒకలా చెబితే… ఇక్కడ బండి సంజయ్ మరోలా మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్ చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను జైలుకు పంపుంతా అన్న బండి సంజయ్ నన్ను జైలుకు పంపి బతికి బట్టకడతావా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను టచ్ చేసి చూడు ఏంటో తెలుస్తుంది అని…
రైతు బంధులాంటి పథకం ఎక్కాడా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణను చేపట్టమని చెబుతోందన్నారు. అందుకే వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ యాసంగిలో వరి పంట వేయొద్దని చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా ధాన్యం తీసుకోబోమని చెప్పడం శోచనీయమన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ధాన్యాన్ని కూడా…
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో సాగుతోంది. టీఆర్‌ఎస్, బీజేపీ పోటా పోటీగా క్యాంపెయిన్‌లో దూసుకుపోతున్నాయి. టీఆర్‌ఎస్ ప్రచార బాధ్యతలను మంత్రి హరీశ్‌రావు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలో సీనియర్ నేత బి.వినోద్, మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు గెల్లు గెలుపు కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా అధికార పార్టీ హుజూరాబాద్‌లో పావులు కదుపుతోంది. ముఖ్యంగా…