Duddilla Sridharbabu : సిద్దిపేట రైతులకు ‘గడ్డి’తోనే గల్లా నిండా డబ్బు..
- సిద్దిపేటకు బయో గ్యాస్ ప్లాంట్
- రైతులకు అదనపు ఆదాయం
- ఇంధన దిగుమతులపై తగ్గింపు లక్ష్యం
- పెట్టుబడులకు కొత్త అవకాశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. నర్మెట్టలో బయో గ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2047 ఆర్థిక లక్ష్యాలను అందుకునే దిశగా అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని మంచి పథకాలను కూడా ముందుకు తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు.
Harudu: హీరో వెంకట్ కమ్ బ్యాక్.. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ‘హరుడు’!
Also Read
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ప్రస్తుతం మన దేశానికి అవసరమైన ఇంధనంలో 65 శాతం ఇతర దేశాల నుండి దిగుమతి అవుతోందని, అంతర్జాతీయ యుద్ధాల వల్ల క్రూడాయిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో కాలుష్య రహితమైన బయో గ్యాస్ ఫ్యాక్టరీలు ఎంతో అవసరమని, డిసెంబర్ నాటికే ఈ ప్లాంట్ అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ పరిశ్రమల అవసరం ఉంటే అక్కడ ఎలాంటి భేషజాలు లేకుండా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.
సిద్దిపేట ప్రాంతానికి బయో గ్యాస్ ప్లాంట్ రావడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు సమృద్ధిగా అందుబాటులోకి రావడం వల్లే ఈ ప్రాంతానికి కంపెనీలు తరలివస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ ప్లాంట్ వల్ల రైతులకు రెట్టింపు లాభం చేకూరుతుందని, వరి ధాన్యంతో పాటు వరి గడ్డిని అమ్మడం ద్వారా కూడా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని తెలిపారు. బయో ఫ్యూయల్స్ అందుబాటులోకి వస్తే యుద్ధాలు సంభవించినా దేశంలో గ్యాస్ కొరత ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది
మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. గడ్డితో గ్యాస్ తయారు చేయడం అద్భుతమైన ప్రక్రియ అని, ఇది ఇంధన కొరతను తీరుస్తుందని అన్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణ వారు సోదరభావంతో మెలగాలని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. అదే విధంగా తెలంగాణ వారు పెట్టుబడులు పెట్టేందుకు అమరావతిలో కూడా అవకాశాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’లో పారిశ్రామికవేత్తలకు అపారమైన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు