Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakeel Noorani: సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు అప్పుడప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో అలాంటి మరో ఘటన కలకలం రేపుతోంది. 33 ఏళ్ల నటి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీనియర్ దర్శకుడు, నిర్మాత షకీల్ నూరానీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక దాడి, రహస్యంగా వీడియో రికార్డ్ చేయడం, బెదిరింపులు, బలవంతంగా మాత్రలు వేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఆయనపై నమోదయ్యాయి. ‘బడే దిల్ వాలా’, ‘జోరు కా గులామ్’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన షకీల్ నూరానీ వయసు 73 సంవత్సరాలు. ఒక ప్రాజెక్టు స్క్రిప్ట్ గురించి మాట్లాడేందుకు ఇంటికి పిలిపించుకుని, అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు 33 ఏళ్ల నటి మాల్వానీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నూరానీ కోసం గాలింపు చేపట్టారు.
పోలీసుల దర్యాప్తులో నూరానీ మహారాష్ట్రలోని సతారా జిల్లా మేధా ప్రాంతంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 8న మాల్వానీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ముంబైకి తరలించింది. అనంతరం పలు సెక్షన్లతో కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నూరానీని బోరివలి హాలిడే కోర్టులో హాజరుపరచగా, తదుపరి విచారణ కోసం ఆయనను ఆగస్టు 12 వరకు పోలీస్ కస్టడీకి అప్పగించినట్లు సమాచారం. కేసులో ఆరోపణల దృష్ట్యా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదులో మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. తనకు నూరానీతో 2016లో లోఖండ్వాలాలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో పరిచయం ఏర్పడిందని ఆమె తెలిపింది. ఆ సమయంలో సినిమా అవకాశాల కోసం తనను సంప్రదించవచ్చని నూరానీ చెప్పినట్లు ఆమె పేర్కొంది. అనంతరం స్క్రిప్ట్ చదివేందుకు మాల్వానీలోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు తనకు కూల్‌డ్రింక్ ఇచ్చారని, అది తాగిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయానని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
Also Read
- Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
- Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
- Bheems: భోగి సినిమా హిట్ కాకపోతే నా పేరు మార్చుకుంటా.. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సంచలన శపథం!
- Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
ఆ సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు రహస్యంగా వీడియో రికార్డ్ చేసినట్లు నటి ఆరోపించింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని, ఈ విషయం పోలీసులకు లేదా కుటుంబ సభ్యులకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరిస్తూ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గర్భం రాకుండా ఉండేందుకు తనకు బలవంతంగా మాత్రలు వేయించేవాడని కూడా ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. మరోవైపు షకీల్ నూరానీ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ గోయార్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన క్లయింట్‌పై కుట్రపూరితంగా ఆరోపణలు చేశారని ఆయన వాదించారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు నూరానీని దోషిగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. విచారణ ముందుకు సాగిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. ఈ ఘటన మరోసారి సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే యువత ఎదుర్కొనే భద్రతా సమస్యలపై చర్చకు దారితీసింది. సినిమా రంగంలో ఎదగాలనే కలతో పరిశ్రమలోకి అడుగుపెట్టే వారికి అవకాశాల పేరుతో వేధింపులు ఎదురైతే వాటిపై చట్టపరమైన సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉందనే చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : మీనాక్షి సుందరేశ్వరుల కల్యాణంతో కోటి దీపోత్సవంలో భక్తి పారవశ్యం.!
-
Sharwa : డబ్బులు పెట్టి వ్యూస్ కొనుక్కునే స్థితిలో మేము లేము.. ‘భోగి’ వేదికపై శర్వానంద్ సంచలన వ్యాఖ్యలు!
-
Kartik Purnima 2026: కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడికి అర్ఘ్యం.. సరైన టైమ్ ఇదే.!
-
Dimple Hayathi: ఇప్పటిదాకా నన్ను గ్లామర్ డాల్‌గానే చూశారు.. ఆ పాత్ర కోసం అన్నీ వదిలేశా!
-
Sampath Nandi: శర్వానంద్‌కు నేషనల్ అవార్డు రాకపోతే అడగండి
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!