రైతులు పత్తి అమ్ముకోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రైతులు తొందరపడి దళారుల చేతిలో పడొద్దని, పత్తి కొనుగోలు విషయంలో అస్సలు భయపడవద్దన్నారు. పత్తిని మొత్తం కొనుగోలు చేయాలను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ని ప్రధాని మోడీ ఆదేశించారని తెలిపారు. 12 శాతం వరకు తేమ ఉన్నా సీసీఐ పత్తిని కొంటుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎఫ్‌సీఐ, సీసీఐపై రివ్యూ చేసిన కిషన్ రెడ్డి.. ఈరోజు మీడియాతో…
తెలంగాణ పత్తి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు పండించే ప్రతి కిలో పత్తిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. న్యూఢిల్లీలోని ఉద్యోగ్ భవన్‌లో పత్తి సేకరణపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. రైతులకు సజావుగా, ఇబ్బందులు లేకుండా పత్తి సేకరణ జరిగేలా కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది తెలంగాణలో ఉత్పత్తి అయిన పత్తిలో…
Telangana: తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్య త్వరలో తీరనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనితో రాష్ట్రానికి అదనంగా మరో 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇప్పటికే రాష్ట్రానికి కేటాయించిన 40 వేల టన్నులకు అదనంగా లభించనుంది. Medha School : సంచలనం.. మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్..…
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణపై రెవెన్యూశాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ భూ భారతి చట్టం, 2025లోని సెక్షన్ 6, సబ్-సెక్షన్ (1) ప్రకారం నమోదుకాని లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రైతులకు రెవెన్యూ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది.
తెలంగాణ రైతాంగానికి ఉద్దేశించి వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బహిరంగ లేఖ విడుదల చేశారు. యూరియా కేటాయింపులు, స్వదేశీ–దిగుమతి సరఫరాల్లో కేంద్ర ప్రభుత్వం సమన్వయ లోపం, అసమర్థత కారణంగా రాష్ట్రాలకు అవసరమైన పరిమాణం సమయానికి చేరడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Telangana Urea Supply: ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించింది. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాపై వారు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టడంతో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ స్పందించింది. ఈ వారంలోనే తెలంగాణకు 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా రవాణా ఇప్పటికే ప్రారంభమైంది. అదేవిధంగా ఈ వారంలోనే మరిన్ని మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరా…
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ.. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్‌గా నిలబెట్టాం అని చెప్పారు. ద్విముఖ విధానంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. తమ ఆలోచనలో స్పష్టత ఉందని, అమలులో పారదర్శకత ఉందన్నారు. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నాం అని…
Ponnam Prabhakar : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎరువుల కొరతపై బీజేపీ చేస్తున్న విమర్శలు నిరాధారమని, “ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నాయనే విషయం కూడా రామచంద్రరావుకి తెలియదా?” అంటూ మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలు, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో కూడా రామచంద్రరావుకి అర్థం కావడం లేదు. మిగతా విత్తనాలు,…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్లో గరిష్టంగా డిమాండ్ ఉంటుందంటూ కేంద్రమంత్రికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన కేంద్ర మంత్రి.. తెలంగాణ రాష్ట్ర రైతుల డిమాండ్ ను నెరవేర్చే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చూసుకోవాలని ఎరువుల శాఖ అధికారులను ఆదేశించారు.