Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో.. నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న మెగా 158 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు మెగాభిమానులకు. అయితే, మరోసారి ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదనే చెప్పాలి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఏప్రిల్ 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న కొన్ని ఊహించని సమస్యల వల్ల ఈ ఈవెంట్ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం KVN ప్రొడక్షన్స్ సంస్థ విజయ్ ‘జననాయగన్’ విడుదల, లీక్ వివాదంతో సతమతమవుతోంది.
Also Read : Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఈ వివాదం నిర్మాణ సంస్థపై ప్రభావం చూపడంతో, అదే బ్యానర్ నిర్మిస్తున్న మెగా 158 లాంచ్ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితులు చక్కబడే వరకు చిన్న విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ ఇప్పటికే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో, ఈ రెండో ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, KVN ప్రొడక్షన్స్ వివాదాల కారణంగా.. మెగా 158 లేట్ అవుతోంది. ఈ లెక్కన చూస్తే.. 2027 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అసాధ్యంగా కనిపిస్తోంది. నిజానికి, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కానీ జననాయగన్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. మరి చిరు-బాబీ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!