CPI Narayana: సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించారని, తెలంగాణలో ఎంపీ సీటుకు పోటీ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రకటన సంచలనంగా మారింది. సీపీఐ పొత్తు వల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మిగతా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలన్నారు. రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఒంటెద్దు పోకడల వల్లే ఓడి పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అందరినీ కలుపుకుపోయింది కాబట్టి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. కేరళలో 4, తమిళనాడు 2, బెంగాల్ 3, బస్తర్ లోని ఎంపీ సీట్లలో పోటీ చేస్తామని ఇక.. తెలంగాణలో ఒక ఎంపీ, ఏపిలో ఒక ఎంపీ సీట్లో పోటీ చేస్తామని క్లారటీ ఇచ్చారు. బతికి వుండగానే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టుకుంటున్నారని మండిపడ్డారు.
Read also: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలంకు మహిళా ఆక్షనీర్.. ఇదే మొదటిసారి!
పాస్ బుక్ లో జగన్ ఫోటోలు ఎందుకు.. శాశ్వత ముఖ్యమంత్రి కాదు కదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో కేసీఅర్ చేసిన మోసాల కంటే జగన్ ఎక్కువ తప్పులు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు. బీజేపీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలిపారు. మంచి నిర్ణయం తీసుకుంటే ఏపిలో కూడా అధికార మార్పిడి ఖాయమన్నారు. తెలంగాణలో పదవి విరమణ పొందిన అధికారులకు ఏ బాధ్యతలు కట్టబెట్టకూడదన్నారు. అయితే.. తెలంగాణలో ఒక ఎంపీ సీటుకు పోటీ చేస్తామని నారాయణ ప్రకటనకు సీపీఐ కి కాంగ్రెస్ ఎంపీ సీటు ఇస్తుందా..? అనే చర్చలు జరుగుతున్నారు. కాగా.. కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మరి ఎంపీ సీటుపై కాంగ్రెస్ స్పందిస్తుందా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Read also: Kajal Aggarwal: వైట్ శారీలో చందమామలా మెరిసిపోతున్న….కాజల్ అగర్వాల్
మరోవైపు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భూ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వంపై ప్రజలకు కొండంత ఆశలు ఉన్నాయన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందన్న హరీష్ రావు, కేటిఆర్ వ్యాఖ్యలు అహంభావంగా ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ పుణ్యమా అని ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రంపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Road Accident: చైతన్యపురిలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నండిపింది ఎమ్మార్వో కొడుకే..!