పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై మండిపడ్డారు. ‘భారతదేశ చరిత్రలో ఇంత మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన ఎప్పుడూ జరగలేదు. వారు చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. పార్లమెంట్ పై దాడి ఘటనపై చర్చకు పట్టుబట్టారు. ఒకవేళ ఏదైనా జరిగితే సభ్యులు చనిపోయేవారు కదా? బీజేపీ ఎంపీ పాస్ ఇవ్వడం నిజమా కాదా? పొరపాటున ఏ MIM ఎంపీ ఇచ్చి ఉంటే ఏం…
CPI Narayana: సీపీఐ ఓట్లు కలవడం వల్లే కాంగ్రెస్ విజయం సాధించారని, తెలంగాణలో ఎంపీ సీటుకు పోటీ చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ప్రకటన సంచలనంగా మారింది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఆగమేఘాల మీద ఖాళీ చేయించి నడిరోడ్డున పడవేయడం దారుణమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కక్షను మించి రాజకీయతర కక్ష దాగుందని స్పష్టమవుతోందన్నారు.
సీపీఐ ప్రజా పోరు యాత్రలో భాగంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మంచిర్యాల తాండూరు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక ఐక్యతను సాధించడంలో కేసీఆర్ ఫెయిల్ అవుతున్నాడన్నారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం మంచిదే కానీ ముందుగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణకు లక్ష కోట్లు ఇచ్చామని మోడీ చెప్తున్నారని.. ఆయన అబ్బ సొత్తు ఇచ్చారా అని నారాయణ ప్రశ్నించారు. గంగమ్మ జాతరకు బలిచ్చే మేకను పోషించినట్టు రైల్వేని ఆధునికీకరిస్తున్నారని.. ఆ తర్వాత అవి అమ్మేస్తారని ఆయన ఆరోపించారు.
బీజేపీ ఏకచత్రాధిపత్యానికి బీహార్‌లో గండి పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీజీపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. స్వాతంత్ర దినోత్సవం పేరిట జెండా దోపిడీకి మోడీ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు.