KTR Counter: పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? కిషన్‌రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR counter to Kishan Reddy: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కిషన్ రెడ్డి ట్వీట్ చేయగా.. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై మంత్రి కేటీఆర్ అదే విధంగా కౌంటర్ ఇచ్చారు. అసలు మ్యాటర్‌లోకి వస్తే.. మిలియన్ మార్చ్ గుర్తు చేస్తూ మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. మిలియన్ మార్చ్ కు సుభిక్ష కాలం గడిచిందన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలో కనీస గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు మిలియన్ మార్చ్ కు బాధ్యులైన నాయకులు, ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు, విమోచన దినోత్సవానికి సరైన గుర్తింపు లభించలేదన్నారు.ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చి ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఆశయాలను నీరుగార్చేలా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని అన్నారు.
Read also: 5G Smartphone : 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్న ప్రముఖ కంపెనీ
Also Read
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
ఇక కిషన్ రెడ్డి ట్వీట్ పై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పాలని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చి తెలంగాణా పుట్టిందని ఎన్నోసార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పుతో కొట్టుకునే బీజేపీ సన్యాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కావడం లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘మోదీకి వ్యాక్సిన్ కనిపెట్టమని చెప్పకండి.. పనికొచ్చే పనులు చేయండి’ అని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పండి. తల్లిని చంపి బిడ్డను ఇచ్చానని పదే పదే తెలంగాణా పుట్టుకను అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు దండుకునే బిజెపి సన్యాసులకు తెలంగాణ ప్రగతి అర్థం కావడం లేదు. మోదీకి వ్యాక్సిన్ కనిపెట్టమని చెప్పడం మానేసి.. పని చేసే పనులు చేయండి..’’ అంటూ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం?
తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు
మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని… https://t.co/7JzGrxnpgw
— KTR (@KTRBRS) March 11, 2023
తాజావార్తలు
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
-
Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!