సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభంపై ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు. సంక్షోభంలో ఉన్న బ్యాంక్ ను కొనుగోలు చేసేందుకు తాను రెడీగా ఉన్నానంటూ పేర్కొన్నారు. SVBని డిజిటల్ బ్యాంక్ గా మారుస్తానంటూ ట్వీట్ చేశారు. SVBని ట్విట్టర్ కొనుగోలు చేసి డిజిటల్ బ్యాంక్ గా మార్చాలని ఎలక్ట్రానిక్ కంపెనీ రెజర్ సీఈవో మిన్ లియోంగ్ టన్ చేసిన ట్వీట్ కు బదిలిస్తూ దానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ను మూసివేస్తున్నట్లు.. ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఎఫ్డీఐసీ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : BBC: వరస వివాదాల్లో బీబీసీ.. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శలు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్.. అమెరికాలోని 16వ అతి పెద్ద బ్యాంక్.. ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్టార్టప్ కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. ఆర్థిక సంక్షోభం కారణంగా దీన్ని శుక్రవారం మూసివేశారు. ఈ బ్యాంక్ ఆకస్మిక మూసివేత అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 2022 నాటికి 209 బిలియన్ డాలర్ల ఆస్తులు.. 174.4 బిలియన్ డాలర్ల డిపాజిట్ కలిగి ఉంది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్. ప్రస్తుతం ఈ బ్యాంకు మూసివేత ఆస్తుల జప్తు వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు, డిపాజిటర్లు తమ వాటాలను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బ్యాంకులో తక్కువ మొత్తంలో నగదు అందుబాటులో ఉందని.. రెండు రోజుల వరకు ఎవరూ డబ్బును విత్ డ్రా చేసుకోవద్దని SVB సూచించింది. నగదు విషయంలో ఎలాంటి భయాలు వద్దలి బ్యాంక్ తెలిపింది.
Also Read : KTR Counter: పారిపోయిన ఎమ్మెల్యే ఎవరో చెప్పుకోండి చూద్దాం? కిషన్రెడ్డికి కేటీఆర్ కౌంటర్..
ఇక పోతే ఎలాన్ మస్క్ సైతం బ్యాంగింగ్ రంగంలోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ టేకోవర్ తర్వాత ఆ యాప్ లో నగదు బదిలీ ఆప్షన్స్ అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. గూగుల్ పే, ఫోన్ పే తరహాలో పేమెంట్స్ కోసం ట్విట్టర్ ను సైతం ఉపయోగించుకోవచ్చని గతంలో మస్క్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో సిలికాన్ బ్యాంక్ కొనుగోలు చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్ ద్వారా తాను కొత్తగా ప్రవేశపెట్టనున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు ఈ బ్యాంక్ కొనుగోలు వల్ల మరింత ఊతం అందుతుందని ఎలాన్ మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : Kollywood: అసలు ఊహించని కాంబినేషన్ ఇది…
గత కొన్ని రోజుల క్రితం తెచ్చిన బ్లూటిక్ విధానమే ట్విట్టర్ లో డిజిటల్ చెల్లింపులకు బాటలు వేస్తుందని అడ్వర్టైజర్లకు ఎలాన్ మస్క్ వివరించాడు. బ్లూటిక్ సబ్క్రైబర్లు కొన్ని రోజుల క్రితం
క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ తోనైనా సైన్ అప్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇప్పటికే ఉన్న బ్యాంక్ ఖాతాను ఉపయోగించి ట్విట్టర్ ద్వారా తమ వినియోగదారులు ఇతరులకు డిజిటల్ పేమెంట్స్ చేయొచ్చని గతంలో మస్క్ తెలిపారు. బ్యాంక్ ఖాతాకు బదులు.. ట్విట్టర్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని దీని ద్వారా నగదు డిపాజిట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని.. మస్క్ వెల్లడించారు. దీనిలో జమ చేసిన వినియోగదారులకు అధిక వడ్డీలు కూడీ అందిస్తామని ఎలాన్ మస్క్ గతంలోనే పేర్కొన్నారు. దీంతో పాటుగా డెబిట్ కార్డులో, చెక్ లో జారీ చేసిన ఈ వ్యవస్థను సాధ్యమైంతగా విస్తరిస్తామని గతేదాడి నవంబర్ లోనే ఎలాన్ మస్క్ వివరించారు.
Also Read : 5G Smartphone : 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్న ప్రముఖ కంపెనీ