VC Sajjanar : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షించారు. ఇప్పటికే ఈ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు మోసపోయారని, ఆర్థికంగా కూలిపోయారని గుర్తుచేశారు. ఈ తరహా వ్యసనపరచే యాప్స్ వల్ల కుటుంబాలు నాశనం కావడంతోపాటు సమాజంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సజ్జనార్ మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్స్‌పై నిషేధం విధించడం సమాజ రక్షణ దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగు అని అయన అభిర్ణించారు. అయితే కేవలం కొన్ని యాప్స్‌నే కాకుండా, ఇలాంటి దారుణ ప్రభావం చూపే మరికొన్ని యాప్స్‌పైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ఆయన అన్నారు. అలాగే, ఈ యాప్స్ ఏ రూపంలోనూ దేశంలోకి రాకుండా చూడటం కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని ఆయన అన్నారు.
East Godavari: భార్యను కాపురానికి పంపించని అత్తమామలు.. హతమార్చిన అల్లుడు!
కిందిస్థాయి పోలీస్ అధికారులపై ఈ నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేసే బాధ్యత ఉందని, వారికి తగిన అధికారం ఇవ్వాలని సజ్జనార్ సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇప్పటికే ఈ యాప్స్‌పై నిషేధం ఉన్నప్పటికీ, అవి దొడ్డి దారుల ద్వారా మళ్లీ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ మార్గాలను అన్వేషిస్తూ నిర్వాహకులు మరోసారి మార్కెట్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. “ఈసారి మాత్రం కఠిన చర్యలు తీసుకుని, యాప్స్ నిర్వాహకులకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు. సమాజ రక్షణ కోసం కఠిన చట్టాలు, కఠిన అమలు తప్పనిసరి” అని సజ్జనార్ స్పష్టం చేశారు.
Gold Price Today: ఇది కదా కావాల్సింది.. నేడు కూడా భారీ తగ్గింపు!