ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షించారు. ఇప్పటికే ఈ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు మోసపోయారని, ఆర్థికంగా కూలిపోయారని గుర్తుచేశారు.
Rana : హీరో దగ్గుబాటి రానా బెట్టింగ్ యాప్స్ కేసుల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈడీ ఈ కేసును టేకప్ చేసింది. ఆ రోజే విచారణకు రావాలంటూ రానాతో పాటు విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్ లాంటి స్టార్లకు నోటీసులు ఇచ్చింది. రేపు అంటే జులై 23న ఉదయం రానా విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ ఆదేశించింది. అయితే తాజాగా రానా దీనిపై స్పందించారు. తనకు ముందే ఫిక్స్ అయిన వరుస…
ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నలుగురు సినీ తారలకి నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. Also Read : Samantha: నిర్మాత, హీరోయిన్గా సినిమా ఫైనల్ చేసిన సమంత? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రానా దగ్గుబాటి జూలై 23న, ప్రకాష్ రాజ్ జూలై 30న,…
బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ పాల్ అన్నారు. బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్‌ల వల్ల వేల మంది చనిపోయారని గుర్తు చేశారు. లక్షలు, కోట్లు అప్పులు చేస్తూ.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలను అడ్డుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చిందని తెలిపారు.
Betting Apps : క్యాసినో బెట్టింగ్ యాప్ కారణంగా ఓ యువకుడి జీవితం ఘోరాంతమైంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి నష్టపోయిన యువకుడు రాహుల్ చివరకు తన మిత్రుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. రాహుల్ తన బెట్టింగ్ పార్ట్‌నర్ అయిన శాఖమూరి వెంకటేశ్‌కు రూ.3 లక్షల వరకు లోన్ ఇచ్చాడు. అయితే డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగిన రాహుల్‌ను వెంకటేశ్ కిడ్నాప్ చేశాడు. అనంతరం నంద్యాల నుంచి రాహుల్‌ను తీసుకువచ్చి షాద్‌నగర్‌లో దారుణంగా హత్య చేశాడు. Pakistan:…
కృష్ణా జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల అదుపులోనికి తీసుకున్నారు. కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో విచ్చలవిడిగా క్రికెట్ ఆన్లైన్ బెట్టింగులు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నియోజకవర్గ పరిధిలో ఉంగుటూరు మండలంలో 10మందిని, గన్నవరం మండలంలో 10మందిని, బాపులపాడు మండలంలో మరికొందరు క్రికెట్ భూకీలను అదుపులోకి తీసుకున్నారు. నియోజకవర్గ పరిధిలో యువత వ్యసనాలకు బానిసలై బెట్టింగులకు పాల్పడుతున్నారు.
Betting Apps : ఇంటర్నెట్ విస్తృతంగా ప్రాచుర్యం పొందిన తర్వాత, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు, వీటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు మియాపూర్ పోలీసులు మరింత ఉగ్రరూపం దాల్చారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన విచారణను వేగవంతం చేస్తూ పలు ప్రముఖ కంపెనీలపై కేసులు నమోదు చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ను సినీ సెలెబ్రిటీలు, యూట్యూబర్లు భారీగా ప్రమోట్ చేయడం ఇప్పుడు పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఈ యాప్స్ పై దర్యాప్తు…
KA Paul : బెట్టింగ్ యాప్స్ యువతపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మాదకద్రవ్యాలకు అలవాటు పడినట్లే, ఆన్‌లైన్ బెట్టింగ్ కూడా తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ఫలితంగా ఆర్థిక నష్టం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే.. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ వ్యవహారం సంచలన రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఢిల్లీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. మనీ గేమింగ్ – బెట్టింగ్ యాప్స్‌పై సుప్రీంకోర్టులో పిల్…
Betting Apps : తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం, వారి ఇమేజ్‌ను ఉపయోగించి ప్రజలను ఆకర్షించడం ఇప్పుడు చర్చకు దారితీసింది. ఈ వివాదంలో నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ప్రధాన పాత్ర పోషించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు చిత్రసీమలో అగ్రస్థానంలో ఉన్న బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్‌లు ఇటీవల “Fun88” అనే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారంటూ విమర్శలు…