Dil Raju: పైరసీ రాయుళ్ల విషయమై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ CV ఆనంద్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా పలు అంశాలు పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై సినీ పరిశ్రమ నిరంతరం పోరాటం చేస్తోందని, ఈ పోరాటంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఇందుకు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ.. పైరసీ పెరుగుతున్న కొద్దీ నేరాలు కూడా పెరుగుతున్నాయని ఆయన…
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హర్షించారు. ఇప్పటికే ఈ యాప్స్ కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు మోసపోయారని, ఆర్థికంగా కూలిపోయారని గుర్తుచేశారు.
Betting Apps: దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం 357 బెట్టింగ్ యాప్స్, వెబ్‌సైట్లను నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ చర్యలలో భాగంగా 2,400 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడం, 166 మ్యూల్ అకౌంట్లను నిలిపివేయడం, మొత్తం ₹126 కోట్ల నగదును స్తంభింపజేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 700కు పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వీటి ద్వారా ప్రజలను మోసగిస్తూ పెద్ద ఎత్తున డబ్బులను విదేశాలకు…