కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబురిగి జిల్లా కమలాపురలో కంటైనర్ ట్రక్కును ఢీ కొట్టి బస్సు బోల్తాపడింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని నలుగు సజీవ దహనం మయ్యారు. హుటా హుటిన చేరుకున్న పోలీసులు ప్రయాణికులను ఆసుపత్రికి తరలిస్తుండగా నలుగురు మృత్యువాత పడ్డారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో మొత్తం డ్రైవర్ తో సహా 32 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఘటన అనంతరం కొందరు సురక్షితంగా బయట పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రమాదంలో జీపు డ్రైవరికి తీవ్ర గాయాలు కాగా.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితులంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో చిన్నారులు కూడా వున్నట్లు తెలుస్తోంది. మే 29న పుట్టిన రోజు వేడుకలకు ఆరెంజ్ ట్రావెల్ బస్సులో హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళిన బృందం. తిరిగు ప్రయాణంలో ఈ ప్రమాదం సంభవించడంతో.. బస్సు పూర్తీగా దగ్ధమైంది. మంటల్లో నలుగు సజీవ దహనం కాగా మరో నలుగురు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మొత్తం 8 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో అర్జున్(37), సరళ(32), బి.అర్జున్(5), శివకుమార్(35), రవళి(30), దీక్షిత(9), అనిత(40) వున్నారు. బాధితులంతా హైదరాబాద్ లోని ఏకాలనీకి చెందినవారో ఇంకా పూర్తీ వివరాలు తెలియదని పోలీసులు తెలిపారు.