టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎన్టీవీ క్వశ్చన్ అవర్ నిర్వహించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పూర్వీకులంతా బీహార్‌కు చెందినవాళ్లే. దోపిడికి పాల్పడుతున్న వారిపై నేను పోరాటం చేస్తున్నా. గతం గొప్పగా ఉంది కదా అని నెత్తిమీద పెట్టుకుని ఊరేగలేం కదా.. గెలుపు ప్రతిపాదికన టికెట్లు కేటాయించాం. అందుకే మైనంపల్లి కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చాం. రాజకీయాల్లో కొత్తవారికి ఎవరికీ టికెట్లు ఇవ్వలేదు. రాజకీయాల్లో లేని వారికి కాదు.. ప్రజా జీవితంలో ఉన్న వారికే టికెట్లు ఇచ్చాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీతో ఎంఐఎం జతకడుతుంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఢిల్లీలో జరుగుతాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంటే విధానమపరమైన నిర్ణయాలు అక్కడే జరుగుతాయి. స్థిరత్వం, స్తిమితత్వాన్ని కేసీఆర్ కోల్పోయాడు.
3 గంటల విద్యుత్ చాలు అనడానికి నేనెవరిని..? అన్ని వర్గాలు కాంగ్రెస్‌తో ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తే తప్పేంటి..? గ్రూపు రాజకీయాలే కాంగ్రెస్ బలం. ఏ విషయాన్నైనా ఇంటర్నల్‌గా చర్చించుకుంటాం. అది గొడవలా కనిపిస్తుంది. సమస్య ఏదున్నా నేనే ఫోన్ చేసి కనుక్కుంటా. సమస్యలు ఎక్కడుంటే అక్కడికి స్వయంగా వెళ్తున్నా. తెలంగాణను మూడు భాగాలుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు. కేసీఆర్ పాలనలో తెలంగాణ మొత్తం అప్పులపాలైంది. కేసీఆర్ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు విద్య దూరమైంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. కేజీ టు పీజీ నిర్బంధ విద్యను కాంగ్రెస్ అమలు చేసింది. పార్లమెంట్ చేసిన రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.