Revanth Reddy: ప్రగతిభవన్ వాఖ్యలపై రేవంత్ స్పందన.. కేసులకు భయపడను కొత్త ఏమి కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదంటూ టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతిభవన్‌పై వాఖ్యలపై స్పందించిన ఆయన మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న తీవ్రంగా మండిపడ్డారు. 2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని అన్నారు. మొదటి సంతకం పొడుభూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. పొంగులేటి సిద్ధాంతం మంచింది ఆయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదన్నారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. ఇప్పటికే బీజేపీలో చేరిని వారు ఇబ్బందులు పడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ప్రగతిభవన్ పై చేసిన వ్యాఖ్యలపై ఆయన మాట్లాడుతూ.. నేను కేసులకు భయపడను..నాకు కొత్త ఏమి కాదంటూ కొట్టిపడేశారు. కేసీఆర్ భూతం లాంటివాడు పట్టి సీసాలో బందించాలని లేకపోతే తట్టుకోలేమని సంచలన వాఖ్యలు చేశారు. తెలంగాణ జేఏసీ జానారెడ్డి ఇంట్లో పుట్టిందని తెలిపిన రేవంత్ జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ అన్నారు. కేసీఆర్ కి చేతకాదనే కోదండరాంను చైర్మన్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Woman trap: బాలికపై మరో మహిళ ట్రాప్.. యువకులకు అప్పగించి దారుణం
Also Read
ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ళమీద పడ్డ వ్యక్తి కేసీఆర్ అంటూ మాట్లాడారు. తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కూర్చోబెట్టిండు కేసీఆర్ అన్నారు. 90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని తీవ్రంగా ఆరోపించారు. రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా? అంటూ ప్రశ్నించారు. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారని తెలిపారు. ఆయన మంత్రిత్వ శాఖ పేరును తప్పులు లేకుండా రాయడం కూడా రాదు ఎర్రబెల్లికి అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ రావు ఎక్స్పర్ట్ అంటూ మండిపడ్డారు. కాంగ్రెష్ పార్టీ నుండి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలల పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు.. 60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలనుతాగుబోతులను చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
Khammam student: అమెరికాలో కన్నకొడుకు మృతిపై తల్లిదండ్రులు కన్నీరు.. స్పందించిన కేటీఆర్
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!