Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crazy Kalyanam Trailer: టాలీవుడ్లో ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ల జోరు కొనసాగుతోంది. ఈ కోవలోకే చెందిన లేటెస్ట్ మూవీ ‘క్రేజీ కల్యాణం’. తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్ ముఖ్య పాత్రల్లో బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆద్యంతం తెలంగాణ గ్రామీణ నేపథ్యం, బంధుత్వాల గొడవలు, నవ్వులు పూయించే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్లో అన్నిటికంటే ఎక్కువగా ఆడియన్స్‌ను ఆకర్షించిన అంశం ఇందులోని బోల్డ్ అండ్ రా డైలాగ్స్. పెళ్లి చుట్టూ తిరిగే గందరగోళం, “నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు.. నేనొకరిని ప్రేమిస్తున్నా” అంటూ హీరోయిన్ చెప్పే ట్విస్ట్.. ఆ వెంటనే “ఇవన్నీ ఓకే.. మీరిద్దరూ ఎప్పుడైనా ఫిజికల్ అయ్యారా?” అంటూ పెళ్లి కొడుకు పాత్ర అడిగే ఒక్క ప్రశ్నతో ట్రైలర్ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది. కుటుంబ బంధాల నడుమ ఇలాంటి నేటి తరం బోల్డ్ ప్రశ్నలను సరదాగా చొప్పించిన విధానం యూత్‌ను ఆకర్షిస్తోంది.
ట్రైలర్ స్టార్టింగ్ మందు తాగి పొద్దున్నే బొట్లు పెట్టుకుని పూజలు చేసే పెద్దల్లుడు ‘బాలరాజు’ వ్యవహారంతో మొదలైంది. “చిన్నదానికి మంచి సంబంధం తెచ్చి ఊళ్లో నా పోయిన పరువు తెచ్చుకుంటా” అనే డైలాగులు గ్రామీణ జీవన శైలిని సహజంగా ఆవిష్కరించాయి. అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే థియేటర్లలో నవ్వుల విందు గ్యారెంటీ అనిపిస్తోంది. తరుణ్ భాస్కర్ నేచురల్ యాక్టింగ్, తోడుగా గ్రామీణ యాసలో సాగే సంభాషణలు సినిమాపై బజ్‌ను పెంచేశాయి. మొత్తానికి బోల్డ్ కామెడీతో వచ్చిన ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతోంది.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!